లోపల పొత్తులు పైకి ఎత్తులు ... కాంగ్రెస్ టీడీపీ జిమ్మిక్కులు ?

రాజకీయాల్లో రాణించాలంటే ఎత్తులే కాదు పొత్తులు కూడా ముఖ్యమే.ప్రస్తుత రాజకీయాలను చూస్తే ఇదే అర్థం అవుతుంది.ఏపీ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా సొంతంగా అధికారం దక్కించుకునే స్థాయిలో ఉన్నట్టు కనిపించడంలేదు.ఖచ్చితంగా… ఏదో ఒక పార్టీ మద్దతు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తీసుకోవాల్సిందే.లేకపోతే పక్క పార్టీలు అదే పని చేసి అధికారాన్ని తన్నుకు పోతాయి.ఇటువంటి విషయాల్లో ఎప్పుడూ ముందుండే… తెలుగుదేశం పార్టీ ఈసారి ఎన్నికల్లో కూడా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నాయి.

 Chandrababu And Congress Are Playing Double Game For Ap Elections-TeluguStop.com

మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ టిడిపి ఆధ్వర్యంలో మహా కూటమి ఏర్పాటయింది.

ఇందులో టిఆర్ఎస్ వ్యతిరేక పార్టీలు కలిసి సీట్లను పంచుకొని ఎన్నికలకు వెళ్లాయి.అయితే అక్కడ ఫలితాలు తారుమారయ్యాయి.దీంతో టిడిపి కాంగ్రెస్ పార్టీల పొత్తులపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి.

ఆ ఫలితాల ప్రభావంతో… ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లే పరిస్థితి లేదని… దీనికి తగ్గట్టుగానే పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఎన్నికలకు వెళ్తామని… ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని ఉద్దేశం తమకు లేదని క్లారిటీ ఇచ్చేశాడు.

అయితే ఆ మాటలు పైకి చెప్పినా… లోపల రాజకీయం మాత్రం వేరే ఉంది.

చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరే అని తేల్చి చెప్పారు.మరోవైపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగనున్న అఖిలపక్ష సమావేశనికి కాంగ్రెస్ రావడం లేదని తెగేసి చెప్పింది.

సమావేశంపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు.అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం అందలేదన్నారు.

అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లమంటే చంద్రబాబు స్పందించలేదన్నారు.

అయితే ఈ మండిపాటు, విరుచుకుపడటాలు కేవలం మాటలకే పరిమితం అని రాజకీయ పండితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కాంగ్రెస్ టీడీపీ మైండ్ గేమ్ ఆడడం వెనుక పెద్ద రాజకీయమే ఉన్నట్టు కనిపిస్తోంది.ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ ఏపీలో ఒక్క సీటు అంటే ఒక్క సీటు కూడా గెలుచుకునే పరిస్థితుల్లో లేదు.

అందుకే కలిసి ముందుకు వెళ్లడం వల్ల కలిగే ప్రయోజనం కూడా పెద్దగా లేదు.

అందుకే… విడివిడిగా పోటీ చేసి ఎన్నికల తరువాత అవసరం అయితే కలిసే ఉద్దేశం లో ఈ రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయని సమాచారం.

అంతే కాకుండా… కాంగ్రెస్ విడిగా పోటీలోకి దిగడం వల్ల వైసీపీ ఓటు బ్యాంకుని కొంతమేర అయినా… ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అని ఈ రెండు పార్టీలు కలిసి ఎత్తులు వేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube