మహేష్ మాత్రమే ... ప్రభాస్ కాదు

ఎప్పుడు వీలు చిక్కినా, ఆడియో వేడుకలకు హాజరై ఎదుటి వారిని ఎంకరేజ్ చేయటం మన తెలుగు హీరోలకు అలవాటు.ఈ కలుపుగోలుతనం వల్లనే ప్రభాస్ కి ఇండస్ట్రీ నిండా మిత్రులే.

 Only Mahesh Will Attend Bhale Manchi Roju Audio-TeluguStop.com

అందుకే ప్రభాస్ గురించి ఎవరు ఎప్పుడు అసూయగా కాని, చేదుగా కాని మాట్లడితే చూసింది లేదు.ఇక సూపర్ స్టార్ వ్యక్తిత్వం గురించి కొత్తగా చెప్పనక్కరలేదు.చిన్న, పెద్దా అని చూడకుండా, తనకి నచ్చితే చాలు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేస్తాడు మహేష్.1-నేనొక్కడినే, ఆగడు వంటి డిజాస్టర్స్ వలన అభిమానకులకు సమాధానం చెప్పలేక తన సొంత మనిషి సుదీర్ బాబు గత రెండు చిత్రాల ఆడియో వేడుకలకు వెళ్ళలేదు మహేష్.అయితే శ్రీమంతుడు వంటి భారి బ్లాక్బస్టర్ తో అభిమానుల ఆకలి తీర్చిన మహేష్ ఈసారి మాత్రం సుధీర్ ను ఎంకరేజ్ చేయడానికి వస్తున్నాడు.

సుధీర్ బాబు, వామికా జంటగా నటిస్తున్న చిత్రం “భలే మంచి రోజు”.

కొత్త దర్శకుడు శ్రీరాం ఆదిత్య తెరకెక్కించిన ఈ చిత్రాన్ని 70 ఎం ఎం ఎంటర్తైన్మెంట్స్ పతాకంపై సుధీర్ స్నేహితుడు విజయ్ నిర్మించారు.ఈ నిర్మాత ఇటు సుధీర్ తో పాటు , అటు ప్రభాస్ కి మంచి మిత్రుడు.

అందువల్లే, ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ప్రమోట్ చేసాడు ప్రభాస్.సన్నీ ఎంఆర్ సంగీతం వహించిన పాటలు ఈ నెల 25న విడుదల కానున్నాయి.ఈ ఆడియో ఫంక్షన్ కి మహేష్ తో పాటు ప్రభాస్ కుడా వస్తాడని వార్తలు వచ్చాయి.అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆడియో ఫంక్షన్ కి సూపర్ స్టార్ మాత్రమె వస్తున్నాడు.

సూపర్ ఫ్యామిలి అభిమానుల మధ్య ఈ వేడుక జరుగనుంది.

వీలుని బట్టి, ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కు ప్రభాస్ ను ఆహ్వానించాలని యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube