భయపడుతున్న మెగాస్టార్‌?

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా గురించిన వార్తలు గత రెండు సంవత్సరాల నుండి జోరుగా వస్తూనే ఉన్నాయి.చిరంజీవి తన రీఎంట్రీ సినిమా కోసం చాలా రోజులుగా సీనియర్‌ దర్శకులు మరియు నిర్మాతలతో చర్చలు జరుపుతున్నాడు.

 Chiranjeevi Fear With Re Entry-TeluguStop.com

ఇప్పటి వరకు ఎన్నో వందల కథలు చిరంజీవి విన్నట్లుగా తెలుస్తోంది.ఎన్ని కథలు విన్నా కూడా తృప్తి కలుగక పోవడంతో తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘కత్తి’ని రీమేక్‌ చేయాలనుకున్నాడు.

కాని రీ ఎంట్రీ, అదీ 150వ సినిమా రీమేక్‌ వద్దనే ఉద్దేశ్యంతో మళ్లీ కథల అన్వేషణలో చిరు పడ్డట్లుగా తెలుస్తోంది.

ఎందరో రచయితలు మరియు దర్శకులు చిరంజీవి కోసం సూపర్‌ సూపర్‌ కథలు సిద్దం చేసుకు వచ్చారు.

అయితే చిరంజీవి మాత్రం ఇంకా బెటర్‌, ఇంకా బెస్ట్‌ కథలు కావాలని వారికి సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది.హీరోగా సుధీర్ఘ అనుభవం ఉన్న చిరంజీవి కథను ఎంచుకోవడంలో ఇంత తడబాటును ఎదుర్కోవడం గతంలో ఎప్పుడూ లేదు.

రీ ఎంట్రీ సినిమా అంటే కాస్త భయపడుతున్నాడు కనుకే కథను ఎంచుకోవడంలో ఈ జాప్యం జరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు.చిరంజీవి భయం విడిచి ఇప్పటికి అయినా ఒక మంచి కథను త్వరగా ఎంచుకుని సినిమా ప్రారంభించాలని సలహా ఇస్తున్నారు.

ఆయన భయపడుతూ కథను ఎంపిక చేసుకుంటే ఫలితం తారు మారు అయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయ పడుతున్నారు.మరి చిరు చివరకు ఎలాంటి కథను ఎంచుకుంటాడు అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube