దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhar Reddy ) కూతురుగా,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్( YS Jagan ) కి సోదరిగా, తెలంగాణ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వై ఎస్ షర్మిల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైన సంగతి అందరికీ తెలిసిందే.డేరింగ్ & డ్యాషింగ్ యంగ్ లేడీ గా షర్మిల కేజీ మంచి క్రేజ్ ఉంది.
ఎదురుగా ఎలాంటి వాడు ఉన్న ధైర్యం గా నిలబడి సమాధానం చెప్పగల సత్తా ఉన్న లీడర్ ఆమె.రాజన్న బిడ్డ అంటే ఇలాగే ఉండాలి అని ప్రతీ అభిమాని గర్వపడేలా చేసింది షర్మిల.అయితే ఈమధ్య ఈమె తన అన్నయ్య జగన్ తో ఆస్తి విషయం లో విభేదాలు ఏర్పడి, దూరం గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే.ఆయనకి దూరంగా జరిగి తెలంగాణ లో వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ ని స్థాపించింది.
ఈ పార్టీ కార్యకలాపాలలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న షర్మిల ఇటీవలే తన తండ్రి జయంతి వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన వై ఎస్ రాజా రెడ్డి( YS Raja Reddy ) ని విమానాశ్రయం లో రిసీవ్ చేసుకుంటూ దిగిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే.చూసేందుకు యాక్షన్ హీరో లాగా అదిరిపోయే రేంజ్ ఫిజిక్ ని మైంటైన్ చేస్తున్న రాజా రెడ్డి, ఇండస్ట్రీ లోకి హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా లాంటి అనుమానాలు అభిమానుల్లో కలిగింది.ఆ అనుమానాలు నిజమే అని అంటున్నాయి ఇండస్ట్రీ కి చెందిన కొన్ని విశ్వసనీయ వర్గాలు.వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం రాజా రెడ్డి కి సినిమాల్లో హీరో అవ్వాలనే ఆసక్తి మొదటి నుండి ఉందని, త్వరలోనే అతను టాలీవుడ్( Tollywood ) లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది.
ఈ చిత్రానికి వై ఎస్ షర్మిల నిర్మాతగా వ్యవహరిస్తారాట.
రీసెంట్ గానే ఆమె ప్రముఖ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్( Director Puri Jagannath ) తో ఈ విషయమై ప్రత్యేకంగా భేటీ కూడా అయ్యినట్టు తెలుస్తుంది.ఆయన వినిపించిన స్టోరీ షర్మిలకు అలాగే రాజా రెడ్డి కి ఎంతో బాగా నచ్చిందని, ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది ప్రారంభం లో కానీ ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.రాజకీయ రంగం లో తిరుగులేని శక్తిగా కొనసాగుతున్న వై ఎస్ కుటుంబం, ఇప్పుడు సినీ రంగం లో కూడా పాగా వెయ్యబోతుందని అభిమానులు చెప్పుకుంటున్నారు.
గతం లో షర్మిల నిర్మాతగా ప్రభాస్ ని హీరో గా పెట్టి యోగి అనే సినిమాని నిర్మించింది.ఈ చిత్రం కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ సాధించలేదు.
ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం తో మళ్ళీ సినీ ఇండస్ట్రీ వైపు చూడని షర్మిల, ఇప్పుడు రీ ఎంట్రీ తో నిర్మాతగా సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి.