తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దస్తగిరిని అఫ్రూవర్ గా ప్రకటించడాన్ని న్యాయస్థానంలో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో దస్తగిరి స్టేట్ మెంట్ ఆధారంగా తమను నేరంలోకి నెట్టడం సరికాదని పేర్కొన్నారు.సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్ మెంట్ ఇస్తున్నాడని వైఎస్ భాస్కర్ రెడ్డి ఆరోపించారు.
వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడన్న ఆయన దస్తగిరికి బెయిల్ సమయంలోనూ సీబీఐ సహకరించిందని తెలిపారు.దస్తగిరిపై ఉన్న ఆధారాలను కింది కోర్టు పట్టించుకోలేదన్నారు.
ఈ క్రమంలో దస్తగిరి బెయిల్ ను రద్దు చేయాలని భాస్కర్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు.