రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మర్రిపల్లిలో దారుణం చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఆ గ్రామానికి చెందిన ఈర్లపల్లి కిరణ్(28), అదే గ్రామానికి చెందిన ఏదుల మహేష్ స్నేహితులు. కిరణ్ హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనిచేసేవాడు.
అప్పడప్పుడూ గ్రామానికి వచ్చి వెళ్తుండేవాడు.
ఇంటికి వచ్చిన సమయంలో స్నేహితుడు మహేష్ ఇంటికి కూడా వెళ్లేవాడు.
ఆ సమయంలో మహేష్ వదినతో కిరణ్‌కి పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది.తన వదినతో కిరణ్ చనువుగా ఉండడం చూసి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానించాడు.
స్నేహితుడే కదా అని ఇంటికి రానిస్తే వదినతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రగిలిపోయాడు.అర్ధరాత్రి వేళ కిరణ్‌కి ఫోన్ చేసి ఇంటికి రమ్మనడంతో రాత్రి 11 గంటల సమయంలో వెళ్లాడు.
వదినతో వివాహేతర సంబంధం విషయమై నిలదీయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.ఇంతలో అక్కడే ఉన్న మహేష్ అన్న శ్రీశైలం, వదిన రమాదేవి, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేశంలో కిరణ్‌పై దాడి చేశారు.
గొడ్డలి తీసుకుని తలపై కొట్టడంతో కిరణ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.స్పాట్‌లోనే ప్రాణాలు విడిచాడు.ఈ విషయం గ్రామంలో దావానలంలా వ్యాపించింది.భారీగా గ్రామస్తులు చేరుకున్నారు.
మహేష్ కుటుంబ సభ్యులు పథకం ప్రకారమే కిరణ్‌ని పిలిపించి కిరాతకంగా చంపేశారని మృతుడి తండ్రి కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.యువకుడి హత్య గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.
పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశారని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగడంతో ఏసీపీ వచ్చి సర్దిచెప్పారు.నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు.