ఉప్పు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంట్లోనూ ప్రతి రోజు దీని వాడకం ఉంటుంది.మనం తీసుకునే ఆహారంలో ఉప్పు అత్యంత ప్రధానపాత్ర పోషిస్తుంది.ముఖ్యంగా కూరల్లో కాస్తంత ఉప్పు తక్కువైనా.ఎక్కువైనా రుచే మారిపోతుంది.అయితే సాధారణంగా కొందరు ఉప్పు ఎక్కువగా వాడుతుంటారు.
అయితే ఉప్పు ఆరోగ్యానికి మంచిదే.కానీ, అతిగా తీసుకుంటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టేస్తుంటాయి.
అందుకే ఉప్పు ఎంత తక్కువ తీసుకుంటే.ఆరోగ్యానికి అంత మంచిదని వైద్యులు ఎప్పటికప్పుడు చెబుతుంటారు.
అయితే ఇంతకీ ఉప్పు తగ్గించి తీసుకుంటే.ఏ ఏ ఆరోగ్య లాభాలు పొందొచ్చు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా ఉప్పు అతిగా వాడితే.రక్తం పరిమాణం పెరిగి రక్తపోటు అధికం అవుతుంది.
అయితే రోజువారి ఆహారంలో ఉప్పును తగ్గించి తీసుకోవడం వల్ల అధిక రక్త పోటు అదుపులో ఉంటుంది.అలాగే ఉప్పును తగ్గించి తీసుకోవడం వల్ల రక్తంలో పెరిగే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
ఫలితంగా గుండె పోటు మరియు ఇతర గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు.అదే సమయంలో గుండె పని తీరు కూడా మెరుగుపడుతుంది.
ఉప్పు అతిగా తీసుకుంటే శరీరంలో సోడియం లెవల్స్ పెరిగిపోతాయి.దాంతో నిద్రలేమి, తరచు మూత్రం రావడం వంటి సమస్యలు ఏర్పడతాయి.అయితే ఉప్పు తగ్గించి తీసుకుంటే.ఆ సమస్యలకు దూరంగా ఉండొచ్చు.అలాగే ఉప్పు తగ్గించి తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. మధుమేహం వచ్చే రిస్క్ తగ్గుతుంది.
ఇక ఉప్పు తగ్గించి తీసుకోవడం వల్ల ఆలోచనా శక్తి పెరుగుతంది.
ఇక ఉప్పు తక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు మరియు కిడ్నీ డ్యామేజ్ వంటి సమస్యలకు కూడా దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఉప్పు తగ్గించి తీసుకోవడం వల్ల ఎముకలు, కండరాలు బలంగా మారతాయి.కాబట్టి.సాధ్యం అయినంత వరకు ఉప్పును తగ్గించే తీసుకోండి.ఆరోగ్యాన్ని కాపాడుకోండి.