సీఎం జగన్ రేపు శ్రీకాకుళం.ఒడిశా ప్రాంతాలలో పర్యటించనున్నారు.
ఉదయం 11 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంట 15 నిమిషాలకు పాతపట్నం చేరుకొని.అక్కడ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్ ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించ నున్నారు.
అనంతరం శ్రీకాకుళం పర్యటన ముగిసిన తర్వాత విశాఖపట్నం విమానాశ్రయం చేరుకుని అక్కడ నుండి బయలుదేరి మధ్యాహ్నం మూడున్నర గంటలకి భువనేశ్వర్ చేరుకున్నారు.
అనంతరం సాయంత్రం 5 గంటలకు.
భువనేశ్వర్ లో.ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్నారు అనంతరం ఉభయ రాష్ట్రాలకు చెందిన పలు అంశాలపై చర్చించనున్నారు.ముఖ్యంగా ఈ భేటీలో మూడు ప్రధాన అంశాలపై.ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.విషయంలోకి వెళితే వంశధార నదిపై నేరడి వద్ద ఆనకట్ట నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు, సరిహద్దులోని కొఠియా గ్రామాల అంశాలను ప్రధానంగా చర్చించనునట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో జగన్ పర్యటనకు సంబంధించి ప్రభుత్వ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది.