ప్రముఖ దర్శకుడు నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిగ్రీ కాలేజ్.ఈ చిత్రంలో వరుణ్ హీరోగా దివ్య రావు హీరోయిన్ గా నటించారు.
అలాగే ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లక్ష్మీ నరసింహ సినిమాస్ సంస్థ నిర్మించారు.అయితే ఇటీవల కాలంలో ఈ చిత్ర ట్రైలర్ విడుదల కాగా మంచి ప్రేక్షకాదరణ పొందింది.
అయితే ఈ చిత్రంలో బూతులు మరియు శృంగార భరితమైన సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ఈ చిత్రాన్ని విడుదల నిలిపి వేయాలంటూ పలు మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
అయితే ఈ చిత్ర ట్రైలర్ ను ఒకసారి గమనించినట్లయితే ఎక్కువగా దర్శకుడు శృంగార భరితమైన సన్నివేశాలను టార్గెట్ చేస్తూ చిత్రాన్ని మొత్తం ఎలివేట్ చేసే చేసినట్లు అనిపిస్తుంది.
అంతేగాక తెలంగాణ యాసలో ఉన్నటువంటి కొన్ని బూతు డైలాగులు కూడా హైలెట్ చేశారు.అయితే ఇదిలా ఉండగా ఈ చిత్ర ట్రైలర్ లో ముఖ్యంగా కాలేజీలోని క్లాస్ రూమ్ లో జరిగినటువంటి కొన్ని రొమాన్స్ సీన్లు మరీ ఓవర్ గా అనిపిస్తున్నాయి.
అంతేగాక విద్యార్థులు దేవాలయం గా భావించే టువంటి కాలేజీ లోనే శృంగారం చేయడం ఏమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంతే కాక ఇలాంటి సన్నివేశాల వల్ల కాలేజీ విద్యార్థులు చెడిపోతున్నారని భావించి పలువురు మహిళా సంఘాల నాయకులు ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదనే ధర్నా చేపడుతున్నారు.
అయితే దర్శకుడు మాత్రం కథనం డిమాండ్ చేసినందువల్ల నే అటువంటి సన్నివేశాలను తెరకెక్కించామని ఎవర్నీ ఉద్దేశించి చిత్రీకరించలేదని అంటున్నాడు. అంతేగాక ఇప్పటికే ఇటువంటి శృంగార సన్నివేశాలు వస్తున్నటువంటి అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని సీన్లను తొలగించామని అన్నారు. కానీ చిత్ర విడుదలను మాత్రం ఆపొద్దని చిత్ర యూనిట్ సభ్యులు వేడుకుంటున్నారు.