అక్రమ సంబంధంతో మహిళ దారుణ హత్య !

Woman Brutally Murdered In Illicit Affair

భార్య పుట్టింటికి వెళ్లడంతో ఓ వ్యక్తి తన ప్రియురాలిని ఇంటికి రప్పించుకున్నాడు.ఏమైందో తెలియదు.

 Woman Brutally Murdered In Illicit Affair-TeluguStop.com

వారిద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది.కోపోధ్రిక్తుడైన ఆ వ్యక్తి ఆ మహిళ తలపై కర్రతో గట్టిగా కొట్టాడు.

అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.

 Woman Brutally Murdered In Illicit Affair-అక్రమ సంబంధంతో మహిళ దారుణ హత్య -Telugu Crime News(క్రైమ్ వార్తలు)-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అక్రమ సంబంధం పెట్టుకుని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

చిలకానగర్ లో అంజయ్య అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు.అయితే అతడికి రేణుక అనే మహిళతో కొన్నేళ్లుగా అక్రమ సంబంధం నడుస్తోంది.ఈ క్రమంలో ఆదివారం అంజయ్య భార్య పుట్టింటికి వెళ్లింది.దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న అంజయ్య తన ప్రియురాలిని ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు.

దీంతో మహిళ ఇంటికి రాత్రి వచ్చింది.ఇద్దరు మాట్లాడుతుండగా.ఏం జరిగిందో తెలియదు అంజయ్య, రేణుక మధ్య గొడవ నెలకొంది.వాగ్వాదం పెరుగుతూ వచ్చింది.

దీంతో కోపోధ్రిక్తుడైన అంజయ్య పక్కనే ఉన్న కర్రను చేత పట్టి రేణుక తలపై గట్టిగా కొట్టాడు.దీంతో రేణుక తీవ్ర రక్తస్రావం ఏర్పడి అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది.

అనంతరం అంజయ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ఆధారాలు సేకరించిన హత్యకు కారణాలు తెలియడం లేదని పోలీసులు తెలిపారు.

#Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube