వ్యవసాయం చేసి కోటీశ్వరులు కావడం సులువైన విషయం కాదు.అయితే నిజంగా కష్టపడితే వ్యవసాయం చేసి కూడా కోటీశ్వరులు కావడం సాధ్యమేనని ఒక వ్యక్తి ప్రూవ్ చేశారు.కర్ణాటకకు చెందిన శశికుమార్( Shashikumar ) వ్యవసాయం ద్వారా ఏడాదికి 205 కోట్ల రూపాయలు సంపాదించారు.17 సంవత్సరాల పాటు ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసి రాజీనామా చేసిన శశికుమార్ దేశం ఎంత అభివృద్ధి చెందుతున్నా వ్యవసాయానికి( Agriculture ) మాత్రం ప్రత్యామ్నాయం లేదని భావించారు.
కెమికల్స్ కలిపిన ఆహారం తినడం వల్ల శశికుమార్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం గమనార్హం.అందువల్లే ఆర్గానిక్ పద్దతులతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నామని శశికుమార్ కామెంట్లు చేశారు.9 మంది స్నేహితులతో కలిసి శశికుమార్ అక్షయకల్ప ఆర్గానిక్ ను( Akshayakalpa Organic ) మొదలుపెట్టారు.శశికుమార్ ముగ్గురు రైతులతో కలిసి మొదట పాల వ్యాపారాన్ని మొదలుపెట్టారు.

ఆ తర్వాత సేంద్రీయ కూరగాయలు, పండ్ల వ్యాపారంపై శిశికుమార్ దృష్టి పెట్టారు.రైతులకు, కొనుగోలుదారులకు మధ్య వారధిగా నిలుస్తూ శశికుమార్ భారీ స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్నారు.గత ఆర్థిక సంవత్సరంలో శశికుమార్ సంస్థ 205 కోట్ల రూపాయలు( 205 Crores ) ఆర్జించడం గమనార్హం.ఈ ఏడాది ఆదాయం మరింత పెరుగుతుందని శశికుమార్ భావిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సంస్థ 60,000 లీటర్ల సేంద్రీయ పాలను( Organic Milk ) ఉత్పత్తి చేస్తున్నట్టు తెలుస్తోంది.ఈ సంస్థ తరపున ప్రముఖ నగరాలలో మార్కెటింగ్ సేవలు అందించడానికి 500 మందికి శిక్షణ ఇస్తున్నారు.10 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్త డెయిరీ ప్లాంట్ ను ప్రారంభించామని రోజుకు లక్ష లీటర్ల పాలను ప్రాసెసింగ్ చేసే అవకాశం ఉందని శశికుమార్ చెబుతున్నారు.శశికుమార్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.
రాబోయే రోజుల్లో ఈ సంస్థ టర్నోవర్ మరింత పెరగడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.