ఈ ఏడాది ఐపీఎల్-2023( IPL-2023 ) ప్రారంభం అయినప్పటి నుంచి చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని( Mahendra Singh Dhoni ) రిటైర్మెంట్ గురించి జోరుగా చర్చ సాగింది.2023 తర్వాత మహేంద్రసింగ్ ధోని కచ్చితంగా రిటైర్మెంట్ ప్రకటిస్తారని ఎన్నో వాదనలు వినిపించాయి.ఈ విషయంపై పలువురు కామెంటేటర్లు అడిగిన ప్రశ్నలకు మహేందర్ సింగ్ ధోని అస్పష్టమైన సమాధానాలు చెప్పడంతో క్రికెట్ అభిమానుల మధ్య ధోని రిటైర్మెంట్ గురించి చర్చ జరుగుతూనే ఉంది.
ఇక ఐపీఎల్- 2023 లో ఫైనల్ మ్యాచ్ తర్వాత తన రిటైర్మెంట్ గురించి ప్రశ్నించగా.
తన రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే మంచి సమయం కానీ థాంక్యూ అనే మాట చెప్పి తప్పించుకోవడం సరికాదని చెబుతూ.వచ్చే సీజన్లో తన శరీరం సహకరించే దానిని బట్టి ఆడతానా లేదా అనే విషయం తెలుస్తుంది అని చెప్పాడు.
ఇంకా 2024-ఐపీఎల్ మినీ వేలనికి సమయం ఉంది కదా ఆ లోపు నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు.
ఇక ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత మహేంద్రసింగ్ ధోని తన మోకాలికి శాస్త్ర చికిత్స( knee treatment ) చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే మోకాలికి శాస్త్ర చికిత్స జరగడంతో మళ్లీ క్రికెట్ అభిమానుల మధ్య ధోని వచ్చే ఏడాది ఆడతాడా లేదా అనే విషయంలో చర్చ మొదలైంది.
తాజాగా చెన్నై జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్( CEO Kashi Viswanathan ) మాట్లాడుతూ మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్ పై స్పష్టత ఇచ్చారు.వచ్చే సీజన్ లో కచ్చితంగా మహేంద్రసింగ్ ధోని ఆడతాడని, ఆ నమ్మకం మాలో ఉందని చెప్పుకొచ్చాడు.ఈ ఏడాది చివర డిసెంబర్ లేదా జనవరిలో ఐపీఎల్-2024 మినీ వేలం జరిగే అవకాశం ఉంది.
ఆ సమయంలోపు మహేంద్రసింగ్ ధోని ఫిట్ గా ఉండి శరీరం సహకరిస్తే వచ్చే సీజన్లో ధోని ఆటను మరోసారి చూడవచ్చు.కాబట్టి దీనికి కాలమే సమాధానం చెబుతుంది అంటూ తెలిపారు.