క్యూబా, వెనిజులాపై( Cuba , Venezuela ) కొన్నాళ్లుగా అమెరికా ( America )ఆంక్షలు విధించిన సంగతి తెలిసినదే.అయిదు ఈ ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతూ అమెరికాలోని కాంగ్రెస్ డెమోక్రాట్ల బృందం ఏకమై అధ్యక్షుడు బైడెన్‌కి లేఖ రాయడం జరిగింది.వారు ఈ సందర్భంగా లేఖలో పేర్కొంటూ.“ట్రంప్ పాలనా కాలంలో వలసలపై ఆంక్షలు విధించారు.ఈ ఆంక్షలు ప్రస్తుత వలసల పెరుగుదలతో ప్రధాన అడ్డంకిగా మారాయని నిపుణులు చెబుతున్నారు.ట్రంప్ పరిపాలనలో ఈ 2 దేశాలపై విధించిన విచక్షణారహిత ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయడానికి వేగంగా చర్య తీసుకోవాలని మిమ్మల్ని మేము కోరుతున్నాము.” అని డెమోక్రాట్ల బృందం బైడెన్‌కి( Biden ) రాసిన లేఖలో రాసుకొచ్చింది.
కాగా, ఈ లేఖపై అరిజోనాకు చెందిన రౌల్ ఎమ్ గ్రిజల్వా( Raul M Grijalva ), కాలిఫోర్నియాకు చెందిన నానెట్ బర్రాగన్ ( Nanette Barragan ), టెక్సాస్‌కు చెందిన గ్రెగ్ కాసర్, మిచిదాగాన్‌కు చెందిన టి లాయిబ్, న్యూయార్క్‌కు చెందిన అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌లతో సహా ప్రతినిధుల సభలో డెమోక్రాట్‌లు ఈ లేఖపై సంతకం చేయడం జరిగింది.ట్రంప్ కాలం నాటి ఇమ్మిగ్రేషన్ పాలసీ మే 11తో ముగియనుంది.దీంతో డెమోక్రాట్ల బృందం బైడెన్‌కు లేఖ రాసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
క్యూబా మరియు వెనిజులా మధ్య సంబంధాలు గురించి ప్రపంచానికి తెలిసినదే.1902లో ఈ ఇరు దేశాలమధ్య మంచి సత్సంబంధాలు ఏర్పడ్డాయి.అయితే 1960లలో వీటిమధ్య అనూహ్యంగా సంబంధాలు దెబ్బతిన్నాయి.విషయం ఏమంటే, ఎన్నికలేతర మార్గాల ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలతో సంబంధాలు కలిగి ఉండకూడదనే బెటాన్‌కోర్ట్ సిద్ధాంత విధానాన్ని అనుసరించి వెనిజులా 1961 చివరలో సంబంధాలను పూర్తిగా తెంచుకుంది.
మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ప్రభుత్వ వ్యతిరేక గెరిల్లా దళానికి క్యూబా మద్దతు వహించడమే దానికి కారణం.