ఇండస్ట్రీ లో కొందరు కొన్ని మంచి సినిమాలు చేసి ఆ తర్వాత కూడా కొన్ని హిట్లు కొట్టినప్పటికి ఎందుకో వాళ్ళు ఇండస్ట్రీ లో ఎక్కువ కాలం నిలువ.లేకోతున్నారు కారణం ఏంటి అంటే వాళ్ళు ఈ జనరేషన్ కి తగ్గట్టు సినిమాలు తీయడం లో చాలా వరకు ఫెయిల్ అవుతున్నారు అని ట్రేడ్ పండితులు అంటున్నారు.కానీ ఈ వీళ్ళు ఈ సినిమా తీయడం వల్ల చాలా మంది కి లైఫ్ దొరుకుతుంది…నిజానికి ఒక సినిమా తీయాలి అంటే చాలా కష్టమైన పని అయిన కూడా డైరెక్టర్ ఒక హీరో ను ప్రొడ్యూసర్ ని ఒప్పించి మరి సినిమా తీస్తున్నాడు అంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి…
ఇక మ్యాటర్ లోకి వస్తె పవన్ కళ్యాణ్ తో తన మొదటి సినిమా తీసిన డైరెక్టర్ కరుణాకరన్ ( Karunakaran )ఆ సినిమాతో భారీ హిట్ కొట్టాడు ఇక ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవేమీ పెద్ద గా ఆడలేదు ఇక దాంతో ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమా చేసి మళ్ళీ హిట్ కొట్టాడు ఇక దాంతో ప్రభాస్ తో డార్లింగ్ అనే సినిమా( Darling movie ) తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు నిజానికి ఈ సినిమా తో ఆయన మళ్లీ ఇంకోసారి స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు…
కానీ ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాల వల్ల మళ్ళీ ఆయన ప్లాప్ లు అందుకొని ప్రస్తుతం సినిమాలు చేయకుండా కాళీ గానే ఉంటున్నారు…అయితే ఒక పెద్ద హీరో తో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది…ఇక ఈ సినిమా కనక వర్క్ ఔట్ అయితే మళ్ళీ ఆయన ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ అవ్వడం పక్క అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు…