తెలుగు సినిమా పరిశ్రమ అనేది పౌరాణిక సినిమాలతో మొదలయ్యింది.చాలా కాలం పాటు అదే ట్రెండ్ కొనసాగింది.
అయితే కొంతకాలం తర్వాత సామాజిక సినిమాలు తెరకెక్కాయి.కొన్ని సినిమాలు విజయవంతం కావడంతో అదే బాటలో నడిచారు చాలా మంది దర్శకనిర్మాతలు.
అయితే 1935 కాలంలోనే ఓ సామాజిక సినిమా తెరకెక్కి సంచనల విజయంసాధించింది.ఆ సినిమా మరేదో కాదు మాలపిల్ల.ఈ సినిమా కథ అప్పటి వరకు ఎవరూ టచ్ చేయలేదు.1938లో ఈ సినిమా విడుదల అయ్యింది.గూడవల్లి రామబ్రహ్మం ఈ సినిమాను తెరకెక్కించాడు.ఆ రోజుల్లోనే ఈ సినిమాకు లక్ష రూపాయలు ఖర్చు చేసి తెరకెక్కించారు.ఇందులో కాంచనమాల, గోవిందరాజుల సుబ్బారావు, సూరిబాబు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాను కులాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు.
ఓ బ్రాహ్మిన్ అబ్బాయి.ఎస్సీ అమ్మాయితో ప్రేమలో పడటం ఈ సినిమా కథ.అయితే వారి ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడ్డాయి అనేది కథలో బాగా చూపించారు.ఈ సినిమా అప్పట్లో చాలా సెంటర్లలో విడుదల అయ్యింది.
అద్భుత విజయాన్ని అందుకుంది.అయితే పలు చోట్ల ఈ సినిమాకు బ్రహ్మణుల నుంచి భారీగా వ్యతిరేకత ఎదురైంది.
ఇందులో బ్రాహ్మణ అబ్బాయి ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తమను అవమాన పరిచేలా ఉందని.బ్రహ్మణులు ఎవరూ సినిమా చూడొద్దనే పిలుపు ఇచ్చారు ఆ కుల సంఘాల పెద్దలు.
అంతేకాదు. పలువురు బ్రహ్మణులు ఈ సినిమాను చూశారు.కానీ ఈ సినిమా చూశాక ఇంటికెళ్లి మైల స్నానం చేసేవారట.బ్రహ్మణుల తీరుపైనా అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.
సినిమాను సినిమాలా చూడాలి తప్ప వివాదాలు చెయ్యకూడదనే మాటలు వినిపించాయి.ఎన్ని వివాదాలు ఈ సినిమా చుట్టూ తిరిగినా.
అప్పట్లో అద్భుత విజయాన్ని మాత్రం అందుకుంది ఈ సినిమా.ఈ సినిమా విజయవంతం కావడంతో ఇదే దారిలో పలు సినిమాలు తెరుకెక్కాయి.
పలు సినిమా విజయంవంతం అయ్యాయి కూడా.