ఏంటి మాస్టారు ఈ ట్రోల్స్.. మొన్న అతని కాన్సెప్ట్ కాపీ అన్నారు.. ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ అంటగా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన తెరకెక్కించే సినిమాల విషయంలో ఏమాత్రం లెక్క తప్పకుండా సినిమాని రూపొందిస్తున్నారని ప్రతి ఒక్కరూ భావిస్తారు.

 What Kind Trolls Is This Firs Movie Now Wed Series, Sukumar, Tollywood, Director-TeluguStop.com

ఇలా సుకుమార్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు.అందుకే సుకుమార్ సినిమాలంటే ప్రేక్షకుల్లో కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప.ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు ఈ సినిమా వారి అంచనాలను చేరుకోలేకపోయిందని చెప్పవచ్చు.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం రికార్డులను సృష్టిస్తోంది.

ఇకపోతే పుష్ప సినిమా విడుదలైనప్పటి నుంచి ఏదో ఒక వివాదాన్ని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో సమంత నటించిన ఐటెం సాంగ్ పై కొందరు పురుష సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తూ కేసులు కూడా పెట్టారు.

అలాగే ఈ సినిమా విడుదలైన తర్వాత ఇందులో అల్లు అర్జున్ రష్మిక మధ్య అసభ్యకర సన్నివేశాలు ఉన్నాయంటూ నెటిజెన్స్ ట్రోల్ చేయడంతో ఈ విషయంపై స్పందించిన సుకుమార్ ఆ సన్నివేశాలను ఎడిట్ చేశారు.

అలాగే ఈ కాన్సెప్ట్ ఒక విలేకరిది అంటూ గత రెండు రోజుల క్రితం పుష్ప సినిమా విషయంలో వార్తలు బయటకు వచ్చాయి.

ఇలా ఒక వివాదం తర్వాత మరొక వివాదాన్ని ఈ సినిమా ఎదుర్కొంటూనే ఉంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ఒక కాపీ కథతో తెలుగులోకి రీమేక్ అయిందనే వార్తలు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి.

ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు ఒక వెబ్ సిరీస్ ను కాపీ కొట్టి పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించడం ఏంటి మాస్టారు అంటూ పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే ఈ సినిమాను ఏ వెబ్ సిరీస్ నుంచి కాపీ కొట్టారు అనే విషయానికి వస్తే.

నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ప్రముఖ వెబ్ సిరీస్ ‘నార్కోస్’ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Telugu Cope, Sukumar, Tollywood, Kindtrolls-Movie

నార్కోస్ లో డ్రగ్స్ మాఫియా ఆధారంగా తెరకెక్కిస్తే పుష్ప సినిమా మాత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ ఆధారంగా తెరకెక్కింది.ఇక ఈ వెబ్ సిరీస్ లో హీరో మాస్ పాత్రకు అనుగుణంగానే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లుక్ కూడా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక పుష్ప సినిమాలో ఎంతో కీలకమైన కొండారెడ్డి బ్రదర్స్ పాత్రలు కూడా వెబ్ సిరీస్ ఆధారంగానే సుకుమార్ రాసుకున్నారని అంటున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీసిన మొట్టమొదటి చిత్రమే ఇలా కాఫీ చిత్రం కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.ఇక మొదటి చిత్రంతోనే ఇలాంటి విమర్శలు ఎదుర్కోవడంతో మరి కొద్ది రోజులలో రెండవ పార్ట్ షూటింగ్ మొదలవుతున్న సమయంలో పుష్ప సినిమా గురించి ఈ విధమైనటువంటి కామెంట్స్ రావడంతో ఈ విషయంపై డైరెక్టర్ సుకుమార్ ఏవిధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube