సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ కార్యక్రమాలు మళ్లీ ప్రారంభం అయ్యాయి.కొన్ని వారాల బ్రేక్ తర్వాత మహేష్ బాబు గుంటూరు కారం సినిమా షూటింగ్ లో పాల్గొనడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ షెడ్యూల్ తో సినిమాను ముగించాలని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) భావిస్తున్నాడట.ఈ లాంగ్ షెడ్యూల్ తో సినిమాను ముగించడం ద్వారా మహేష్ బాబు తదుపరి సినిమాకు వెళ్ళవచ్చు అని కూడా భావిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా ఎంపికైన పూజా హెగ్డే ని తప్పించారు అనేది కన్ఫర్మ్ వార్త.
ఆమె ప్లేస్ లో శ్రీ లీలను మొదటి హీరోయిన్ గా తీసుకున్నారు అంటూ నిన్న మొన్నటి వరకు పుకార్ల షికారులు చేశాయి.కానీ శ్రీ లీల పాత్ర ఆమె కంటిన్యూ చేస్తుంది.పూజ హెగ్డే( Pooja Hegde ) పాత్రను మరో హీరోయిన్ తో చేయించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి.
అందుకు గాను మాళవిక మోహన్ మరియు సంయుక్త మీనన్ వంటి హీరోయిన్స్ పేర్లు వినిపించాయి.కొత్తగా మరో రెండు పేర్లు కూడా ప్రచారం జరుగుతున్నాయి.త్వరలోనే ఆ హీరోయిన్ ఎవరు అనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.గుంటూరు కారం సినిమాలో శ్రీ లీల మొదటి హీరోయిన్ గా నటించబోతోంది అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇంతలోనే ఆమె సెకండ్ హీరోయిన్ గానే కంటిన్యూ అవ్వబోతుందని మొదటి హీరోయిన్ గా ఎంపికైన పూజా హెగ్డేను తొలగించి ఆమె స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకు రాబోతున్నారని సమాచారం అందుతుంది.దాంతో గుంటూరు కారం సినిమా( Guntur Karam )పై శ్రీ లీల అభిమానులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.అయితే మారిన స్క్రిప్ట్ మరియు ఇతర విషయాల కారణంగా శ్రీ లీల పాత్ర మెయిన్ హీరోయిన్ అయి ఉంటుందని కొందరు నమ్మకంగా ఉన్నారు.ఇంతకు గుంటూరు కారం సినిమాలో శ్రీ లీల( Sreeleela ) మొదటి హీరోయిన్ పాత్రలో కనిపించబోతుందా లేదంటే రెండవ హీరోయిన్ పాత్రలో కనిపించబోతుందా అనేది తెలియాలంటే మనం సినిమా విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే.