తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు రైతుల ప్రాణాలను కాపాడలేకపోతోందని విమర్శించారు.
చనిపోయిన రైతులకు ఇచ్చే రైతు బీమా కాదు.బతికుండటానికి రైతు భరోసా ఏది కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేశానని చెప్తున్నారన్న ఆయన బంగారు తెలంగాణలో రైతులకు బతుకును ఇవ్వలేకపోతోందని విమర్శించారు.కేసీఆర్ రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ ను ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదన్న రేవంత్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.