అమెరికాలో( America ) ఈ మధ్య అధ్యక్ష భవనం నుంచి కొన్ని పత్రాలు లీకైనాయనే వార్తలు బయటకి పొక్కిననాటినుండి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.అవి ఏమిటంటే ఉక్రెయిన్ రష్యా పై గెలవడం అసాధ్యమని, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ( Zelensky ) మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఆ పత్రాల్లో రాయబడింది.
ఇక నాటో దళాలు, అమెరికా అండ లేనిదే అడుగు కూడా వేయలేని పరిస్థితిలో ఉక్రెయిన్ ( Ukraine ) ఉన్నట్టు అందులో లిఖియింపబడి వుంది.అయితే ఆ విషయాలు అందరికీ తెలిసినవే.
నాటో దేశాలు ఉక్రెయిన్ కి పూర్తిగా సహాయం చేయడానికి సిద్దంగా లేవనే విషయం కూడా తేటతెల్లం అయిపోయింది.ఇప్పటి వరకు సాయం చేసిన అమెరికానే ఉక్రెయిన్ నిందించడం చేస్తోంది.ఆయుధాలు ఇచ్చి రష్యాతో పోరాటానికి సాయం చేస్తున్న అమెరికాను తిట్టి పోస్తుండడం ఇపుడు అమెరికాకు మింగుడు పడడంలేదు.ఇది మమ్మల్ని ఇబ్బంది పెట్టే అంశమే అని జెలెన్ స్కీ అంటూ మా శక్తిని తక్కువగా అంచనా వేయడమే అని తాజాగా అనడంతో పెద్దన్నకు చివుక్కుమంది.
అంత దమ్ముంటే మరి మమ్మల్ని ఎందుకు సహాయం కోరినట్టు అని అమెరికా ఇపుడు ప్రశ్నిస్తోంది.అయితే అక్కడ బయట పడ్డ పత్రాల్లో ఉక్రెయిన్ గురించి తక్కువ చేసి చూపడం ఏ మాత్రం సమంజసం కాదని జెలెన్ స్కీ అమెరికా విధానాలను ఓ వైపు ఎండగడుతున్నారు.మా దేశం కోసం మేం పోరాడుతున్నాం.రేపు మరో దేశంపై కూడా రష్యా ఇలాగే దాడి చేయదని గ్యారంటీ ఏమిటి? ముందుండి నడిపించాల్సిన అమెరికా ఇలా ఉక్రెయిన్ పై విషం కక్కడం ఏమాత్రం మంచిది కాదని జెలెన్ స్కీ అభిప్రాయపడుతున్నారు.