ఏపీలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ చేపట్టిన జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జగనన్న సురక్ష’ ను తీసుకువచ్చింది.రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో దాదాపు నెలరోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
కాగా ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీలో అవినీతిరహిత పాలనను అందిస్తున్నట్లు తెలిపారు.
నాలుగేళ్లలో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చామన్నారు.అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందుతాయని పేర్కొన్నారు.
గతంలో రేషన్ కార్డుల కోసం కూడా ఉద్యమాలు జరిగాయని సీఎం జగన్ తెలిపారు.జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులు, వాలంటీర్లతో కూడిన బృందాలు ప్రతి ఇంటినీ సందర్శిస్తాయి.
అర్హులుగా ఉండి లబ్ది పొందని వారి వివరాలు సేకరించి వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు.