టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ ( Puri Jagannath ) గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.తెరమీదికి ఎన్నో సినిమాలు తీసుకొచ్చి మంచి సక్సెస్ అందుకున్నాడు.
చిన్న హీరోలైన సైతం స్టార్ హీరోలుగా మార్చాడు.మంచి మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకొని కథకు తగ్గట్టుగా హీరోలను ఎంచుకొని తన సినిమాపై మరింత హైప్ పెరిగేలా చేస్తూ ఉంటాడు.
కానీ గత కొంత కాలం నుంచి ఈయన సినిమాలు అంత సక్సెస్ కాలేకపోతున్నాయి.
ఆ మధ్య విడుదలైన లైగర్ సినిమా( Liger movie ) కూడా భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత పూరీ నుండి ఎటువంటి సినిమా అప్ డేట్ లు అయితే లేవు.అయితే గత కొన్ని రోజుల నుండి పూరీ మళ్లీ ఓ సినిమా చేస్తున్నాడని.
అది కూడా హీరో విశ్వక్ సేన్ తో ఓ సినిమా ఫిక్స్ చేశాడు అని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.మామూలుగా పూరీ దృష్టి స్టార్ హీరోల వైపు ఉంటుంది.
కానీ ఈ చిన్న హీరోతో సినిమా చేయడం ఏంటి అని ఆలోచనలో కూడా పడ్డారు.
దీంతో కొంతమంది సినిమా ఏ కాన్సెప్ట్ తో వస్తుందని.ఎప్పుడు ప్రారంభమవుతుంది అని చాలామంది ఎదురుచూస్తున్నారు.దీంతో ఈ విషయం గురించి తాజాగా విశ్వక్ సేన్( Vishwak Sen ) తన సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బాగా దూసుకుపోతున్నాడు విశ్వక్.
తొలిసారిగా వెళ్ళిపోమాకే అనే సినిమాతో పరిచయమైన విశ్వక్ ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ కొంతవరకు సక్సెస్ లు అందుకుంటున్నాడు.ఇటీవలే కూడా ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈయన వ్యక్తిగతంగా కూడా బాగా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాడు.
అప్పుడప్పుడు నోరు జారి బూతు మాటలు మాట్లాడుతూ మీడియా కంట పడుతూ ఉంటాడు.
ఇక ప్రస్తుతం సినిమాల పరంగా ఈయనకు బాగానే కలిసి వచ్చింది.
ఇప్పుడు ఆయన ఖాతాలో పలు సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది.అయితే కొన్ని రోజుల నుండి డైరెక్టర్ పూరీ దర్శకత్వంలో ఈయన సినిమా ఉందని బాగా టాక్ వచ్చింది.
వీరిద్దరి కాంబినేషన్లో మంచి మాస్ సినిమా ఉండబోతుంది అని.అంతేకాకుండా మరి కొన్ని రోజులలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వార్తలు కూడా వినిపించాయి.
దీంతో ఈ విషయం గురించి తాజాగా స్పందించాడు విశ్వక్.ఈ వార్త వింటుంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది అని.కానీ ఇదంతా ఫేక్ అంటూ పెద్ద షాక్ ఇచ్చాడు.గత కొన్ని రోజుల నుండి ఈ విషయం గురించి చూస్తున్నాను అని.అయితే నిజానికి ఈ విషయం గురించి ఇప్పటివరకు నేను పూరీ సర్ తో కూడా మాట్లాడలేదు అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.ప్రస్తుతం ఆ స్టోరీ బాగా వైరల్ అవుతుంది.