విశాఖ సిటీ రాజకీయాలు మారిపోతున్నాయి.ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని.
ప్రైవేటీకరిస్తున్నారనే వార్తలు రావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున అలజడి నెలకొంది.ఈ విషయం రాజకీయ రంగు పులుముకుంది.
ఏ పార్టీకి ఆపార్టీ.ఇక్కడ ప్రజలను, ముఖ్యంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీతో సంబంధం ఉన్న ప్రజలను ఆకర్సించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.ఎవరూ కోరకుండానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది.టెక్నికల్‌గా ఇది పాస్ అవకపోయినా.సెంటిమెంటు ప్రకారం చూస్తే.విశాఖ ఉక్కుకోసం త్యాగం చేసిన నాయకుడిగా ఆయనకు పేరు వచ్చింది.
ఇక, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.ఉద్యమాలకు స్కెచ్ సిద్ధం చేస్తోంది.
ఇక, కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌తో కలిసి ఉమ్మడి పోరాటాలకు రెడీ అవుతున్నారు.ఇదిలావుంటే.
అధికార పార్టీని కార్నర్ చేయడంలోను, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెనుక వైసీపీ కీలక నేతల హస్తం ఉందని ప్రచారం చేయడంలోను టీడీపీ ముందుంది.ఈ విషయంలో టీడీపీ అనుకూల మీడియ కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది.
ఇప్పటికే టీడీపీ కీలక నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమా వంటివారు.పోస్కో కంపెనీకి ఉక్కు ఫ్యాక్టరీకి చెందిన స్థలాన్ని కేటాయించేందుకు జగన్ ఏడాది కిందటే ప్లాన్ చేశాడని.
ఈ క్రమంలో ఆ కంపెనీకే ఇప్పుడు ఉక్కును విక్రయించేందుకు రెడీ అయ్యారని బలంగా ప్రచారంలోకి తీసుకువచ్చారు.

అంటే.విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనకు వైసీపీ అధినేత , సీఎం జగన్ మూల కారణమనే వాదనను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో టీడీపీ ఇప్పటికే సక్సెస్ అయిందనే అంచనా వస్తోంది.అయితే.
ఇప్పుడు ఇంతగా ఈ ప్రచారానికి కారణం ఏంటి? ఎందుకు వైసీపీని టార్గెట్ చేయాలి? అందరూ కలసి కట్టుగా ఉద్యమించాల్సిన స్థానంలో ఇలా వైసీపీని టార్గెట్ చేయడం వెనుక కీలక కారణం ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది.దీనికి ప్రధాన కారణం.
మార్చిలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలే అంటున్నారు పరిశీలకులు.ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే కార్పొరేషన్ ఎన్నికలకు తెరదీయనున్నారు.
ఈ క్రమంలో.విశాఖ మేయర్ పీఠంపై టీడీపీ దృష్టి పెట్టింది.వాస్తవానికి 2019 ఎన్నికల్లో విశాఖలోని తూర్పు, ఉత్తరం, దక్షిణ, వెస్ట్ నియోజకవర్గాల్లో టీడీపీ గంపగుత్తుగా గెలుచుకుంది.వీరిలో ఒక్కరు మాత్రమే వైసీపీ పంచన చేరినా.
మిగిలిన ముగ్గురు బలంగా టీడీపీలోనే కొనసాగుతున్నారు.ఈ నేపథ్యంలో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఇప్పటికే ఉన్న బలానికి తోడు.
విశాఖ ఉక్కు ఉద్యమాన్ని తమకు అందివచ్చిన వరంగా టీడీపీ భావిస్తోంది.ఈ నేపథ్యంలోనే వైసీపీని కార్నర్ చేయడం ద్వారా.
విశాఖ కార్పొరేషన్‌లో కీలకమైన ఉక్కు ఫ్యాక్టరీతో అనుబంధం ఉన్న ప్రజలను తనవైపు తిప్పుకొనేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందనే భావన వ్యక్తమవుతోంది.
ఇది కనుక సక్సెస్ అయితే.
మేయర్ పీఠం అంటే.మెజారిటీ వార్డులు టీడీపీ ఖాతాలోకే చేరడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
ఇక, వైసీపీ విషయానికి వస్తే.అటు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఉత్తరాంధ్ర ఇంచార్జ్ విజయసాయిరెడ్డిల దూకుడును బట్టి.
ఈ పార్టీవైపు ప్రజలు నిలబడతారా? లేదా? అనేది చూడాలని అంటున్నారు పరిశీలకులు.మరి ఏం జరుగుతుందో చూడాలి.