వైరల్ వీడియో : కోతి పిల్ల - బాతు పిల్లల ఆట బలే ఉందిగా..!

దేవుని సృష్టి భలే విచిత్రంగా ఉంటుంది కదా.ఉదాహరణకు కుక్కకి, పిల్లికి మధ్య జాతి వైరం ఉంటుంది.

 Viral Video: Monkey Cub - Duckling Ata Bale Is Viral Latest, Viral News, Viral-TeluguStop.com

ఒకదాన్ని ఒకటి చూసుకుంటే కొట్టుకుంటాయి.కానీ ఒక్కోసారి అవి రెండు ఎంతో కలిసి మెలిసి ఉంటున్న వీడియోలను మనం చాలానే చూసి ఉంటాము.

మరి జంతువులు, పక్షులు కలిసి ఆడుకోవడం మీరు ఎప్పుడన్నా చూసారా.? వింటుంటేనే విచిత్రంగా ఉంది కదా.ఎందుకంటే జంతువులు సాటి జంతువులతోనే స్నేహంగా మెలుగుతాయి అలాగే పక్షులు కూడా సాటి పక్షులతోనే ఆడుకుంటూ కలిసి మెలిసి ఉంటాయి.కానీ జాతి వైరాన్ని మరచి జంతువులు, కొన్ని పక్షులు స్నేహం చేస్తే చూడడానికి భలే విచిత్రంగా ఉంటుంది కదా.అందుకే దేవుని సృష్టి భలే వింత అయినది అంటారు.మరి ఇప్పుడు ఒక జంతువు, కొన్ని పక్షులు కలిసి ఎంచక్కా పచ్చటి గడ్డిలో ఆడుకుంటున్న వీడియోను మీరే చూడండి.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

ఎంతో అందంగా ఉన్న ఒక కోతిపిల్ల ముద్దు ముద్దుగా ఉన్న బాతు పిల్లలతో ఆటలు ఆడుకుంటున్న వీడియో నెటిజన్లను బాగా ఆకర్షించింది.

ఇక వీడియో విషయానికి వస్తే.అందులో ఒక చిన్న కోతిపిల్ల ఎంతో ముద్దుగా, పసుపుగా ఉన్న బుజ్జి బుజ్జి బాతు పిల్లలతో ఎంచక్కా కలిసి ఆడుకుంటోంది.

కోతి పిల్ల గడ్డిలో పరుగులు పెడుతుంటే దానిని అనుసరించి 5 బాతు పిల్లలు చిట్టి చిట్టి అడుగులతో కొద్ది దూరం పరుగులు పెడుతూ చక్కగా ఆడుకుంటున్నాయి.కోతిపిల్లను తమ తల్లిగా భావించి అది ఎక్కడకి వెళితే అక్కడికి ఈ బుజ్జి బుజ్జి బాతు పిల్లలు పరుగులు పెడుతున్నాయి.

వీడియోలో బాతు పిల్లల తల్లి గాని, కోతి పిల్ల తల్లి గాని కనిపించలేదు.ఇవి రెండు మాత్రం తల్లులతో సంబందం లేకుండా ఎంచక్కా జాతి వైరాన్ని మరిచిపోయి ఆడుకుంటున్నాయి.బాతు పిల్లలు కూడా కోతితో చక్కగా ఆడుకుంటూ కోతిపిల్ల చేసే కొంటె చేష్టల్ని చూస్తూ మురిసిపోతున్నాయి.కోతి పిల్ల మీద పడుకోవడం, ఆ కోతి పడుకుంటే దాని పొట్ట మీద పడుకోవడం చూడడానికి భలే ముచ్చటగా ఉన్నాయి.

పాపం ఆడి ఆడి అలసిపోయాయేమో కోతిపిల్లతో పాటు పక్కనే దాన్ని అంటిపెట్టుకుని బాతు పిల్లలు కూడా ఎంచక్కా హాయిగా నిద్రించాయి.ఈ క్యూట్ వీడియో నెటిజన్లకు బాగా నచ్చింది.

ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయకుండా ఉండలేరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube