వైరల్ వీడియో: నిర్మానుష్య ప్రదేశంలో నరకానికి తలుపుని కనిపెట్టిన వ్యక్తి..??

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఒక వీడియో విపరీతంగా వైరల్( Viral ) అవుతోంది.ఆ వీడియోలో ఒక గుహను చూపిస్తూ నరకానికి తలుపు ఇదేనని ఒక వ్యక్తి క్లెయిమ్ చేస్తున్నాడు.

 Viral Video: Man Discovers Door To Hell In Desolate Place , Dark Tunnels, Narro-TeluguStop.com

అందువల్ల ఇది చాలామంది దృష్టిని ఆకర్షిస్తోంది.ఈ వీడియోలో చాలా భయంకరమైన గుహలోకి వెళ్లే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు.

ఆ గుహ భయంకరంగా ఉండటం వల్ల దానికి “నరకానికి ద్వారం” అని అతడు ఒక పేరు కూడా పెట్టాడు.లోపలి దృశ్యాలు చాలా షాకింగ్‌గా కనిపిస్తున్నాయి.

ఈ వీడియోను @losthistorie అనే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ షేర్ చేసింది.ఈ అకౌంట్ చాలామందికి తెలియని పాత, మరిచిపోయిన ప్రదేశాల వీడియోలను తరచుగా పంచుకుంటుంది.

రీసెంట్ వీడియోలో “నరకం”( Hell ) అనే ప్రదేశానికి వెళ్లే వ్యక్తిని చూపించింది.ఈ ప్రదేశం భూగర్భంలో ఉంటుంది.

దాని ప్రవేశ ద్వారం చాలా చిన్నది.

ఆ వ్యక్తి తలుపు దాటి వెళ్లాక, ఇటుకలతో చేసిన దారి, టన్నెళ్లు కనిపిస్తాయి.లోపల చాలా మురికిగా ఉండి, చాలా బురద కనిపిస్తుంది.అతను మరింత లోపలికి వెళ్ళే కొద్దీ, చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న ఎముకలను చూస్తాడు.

ఎముకలు ఏ జంతువులకు చెందినవో వచ్చాయో స్పష్టంగా తెలియదు.ఎంత భయానక దృశ్యాలు కనిపించినా సరే అతను ముందుకు వెళ్తూ, పాత, తుప్పు పట్టిన వస్తువులు కూడా కనుగొంటాడు.

ఈ వీడియో ఇప్పటికే 7 లక్షలకు పైగా వ్యూస్‌ సాధించింది.చాలా మంది వీక్షకులు వారి అభిప్రాయాలను పంచుకున్నారు.

కొందరు రాత్రిపూట అలాంటి గుహలోకి వెళ్లిన వ్యక్తి చాలా ధైర్యవంతుడని అంటున్నారు.మరికొందరు చీకటిగా ఉండే టన్నెళ్లలోకి రాత్రి వేళల్లో వెళ్లడం ప్రమాదకరమని, ఏదైనా జరగొచ్చని కామెంట్లు చేశారు.

కొందరు వ్యూయర్స్‌ ఈ టన్నెళ్లను యుద్ధాల సమయంలో సైనికులు దాక్కునేందుకు ఉపయోగించి ఉండవచ్చని ఊహించారు.

ఈ వీడియో కనిపించిన పెద్ద గుహ అనేది కాలిఫోర్నియాలోని( California) వైల్డర్ రాంచ్ స్టేట్ పార్క్‌లో ఉంది.దీనికి “హెల్ హోల్” అని పేరు పెట్టారు.అది చాలా చీకటిగా, మిస్టీరియస్‌గా ఉండటం వల్ల అన్వేషించడానికి చాలా కష్టంగా ఉంటుంది.

“కేవ్‌మ్యాన్ హైక్స్”( Caveman Hikes ) అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న ఇద్దరు సాహసికులు ఓసారి ఈ గుహ గురించి వీడియో చేశారు.వారు హెల్ హోల్ టన్నెళ్ల గుండా వెళ్లారు.

చాలా చిన్న స్థలాల గుండా వెళ్లాల్సి వచ్చింది కానీ, వారు చివరికి అద్భుతమైనదాన్ని కనుగొన్నారు.దీనివల్ల తమ కష్టానికి ఫలితం దక్కిందని వారు చెప్పుకొచ్చారు.

చాలా ఇరుకైన టన్నెల్ గుండా జేకబ్ వెళుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి, వారు ఎంత ధైర్యవంతులో ఈ వీడియోలు చూస్తే అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube