వైరల్ వీడియో: డ్యాన్స్ తో అదరగొట్టిన వైద్యులు..!

కరోనా సెకండ్‌ వేవ్‌లో వైద్యులకు కనీసం విశ్రాంతి తీసుకునే అవకాశం లేకుండా పోయింది.రోజంతా పీపీఈ కిట్లలోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది.

 Viral Video Doctors Are Dancing To Salman Khan Radhe Movie Seetimaarr Song, Doct-TeluguStop.com

అయితే, ఓ ఆసుపత్రిలో వైద్యులు మాత్రం దొరికిన కాస్త సమయాన్ని వినూత్నంగా ఆస్వాదించారు.సల్మాన్‌ఖాన్‌, దిశాపటాని జంటగా నటించిన ‘రాధే’ చిత్రంలోని ‘సీటీమార్‌’ పాటలకు స్టెప్పులేసి సందడి చేశారు.

అంతేకాదు ఓ వైద్యుడు సంగీత విద్వాంసుడిగా మారి మాండొలిన్ వాయించాడు.మరికొంత మంది అందుకు తగ్గట్లుగా డ్యాన్స్‌ చేశారు.

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్, హాట్ బ్యూటీ దిశా ప‌టానీ జోడీగా తెర‌కెక్కిన రాథే మూవీ ఈద్ సంద‌ర్భంగా ఓటీటీలో విడుద‌లై సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాపై విశ్లేష‌కులు రకరకాలుగా చెబుతున్నప్పటికీ రాథే నుంచి సీటీమార్ సాంగ్ ఆకట్టుకుంటోంది.

క‌రోనా సెకండ్ వేవ్ వ్యాప్తి దేశాన్ని వ‌ణికిస్తుండ‌గా రోగుల‌కు చికిత్స అందిస్తూ అల‌సిన వైద్యులు ఈ పాట‌కు డ్యాన్స్ ల‌తో అద‌ర‌గొట్టి సేద తీరారు.

ఇప్పుడీ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.

ఆ వీడియోను దిశాపటాని ఫ్యాన్స్‌ క్లబ్‌ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.

‘వైద్యులే మన రియల్‌ హీరోస్‌’ అంటూ పొగిడేస్తున్నారు.వారిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

వీడియో క్లిప్ కు నెటిజ‌న్ల నుంచి భారీ స్పంద‌న వ‌స్తోంది.ఇన్ స్టాలో ఇప్ప‌టివ‌ర‌కూ ఈ వీడియో 14,346 వ్యూస్ రాగా, ఇత‌ర సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పైనా షేర్ చేశారు.

వైద్యుల నిస్వార్ద సేవ‌ను నెటిజ‌న్లు కొనియాడారు.గతంలో కూడా చాలా మంది వైద్య సిబ్బంది వివిధ పాటలకు స్టెప్పులేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

కొందరు ఆ వీడియోలను చూసి తప్పుబట్టారు.వైద్యం చేయకుండా రోగుల ప్రాణాలతో ఆడుకుంటున్నారని రకరకాల కామెంట్లు చేశారు.

అయితే వైద్యులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం చేస్తుండటం వల్ల చాలా మంది నోర్లు మూతపడ్డాయి.నిజం చెప్పాలంటే ఈ సమయంలో వైద్యులు ఉపశమనం చాలా అవసరం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube