వైరల్ వీడియో : పడుకొనే మంచుపై స్కీయింగ్ చేసిన శునకం.. !?

మంచు గానీ ఇసుక గాని, ఇంకా మెత్తగా ఉండే ప్రదేశాలను చూడగానే కుక్కలు రెట్టింపు ఉత్సాహంతో ఆడుకుంటాయి.నీటి కాలువలు కనిపించినా వాటిలోకి దూకి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి.

 Dog Skiing Video Viral In Social Media, Viral Video, Social Media, Dog Skiing ,-TeluguStop.com

అయితే మంచు తో కప్పబడిన ఒక ప్రదేశం లో ఒక కుక్క స్కీయింగ్ చేసింది.సాధారణంగా మనుషులు స్కీ బోర్డు పై ఎక్కి మంచు పై విన్యాసాలు చేస్తూంటారు.

కానీ ఓ కుక్క మాత్రం పడుకొని కేవలం తన బొచ్చు ఉపయోగించి స్కీయింగ్ చేసింది.అయితే ఈ కుక్క మంచు పై స్కీయింగ్ చేయడం చూడముచ్చటగా ఉండటం తో యజమానులు వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

దీనితో ఆ వీడియో ట్విట్టర్ లో వైరల్ అవుతోంది.

వాలు గా ఉన్న ఒక రోడ్డుపై మంచు పేరుకుపోవడంతో దాని పై ఉరికి.

తన ముందు కాళ్ళ ని వినియోగించి పై వీడియో లో కనిపిస్తున్న విధంగా ఈ కుక్క చాలా వేగంగా జారి.మళ్లీ పైకి లేచి మరోసారి జారడానికి ప్రయత్నించింది.

అయితే అక్కడ మరింత వాలుగా లేకపోవడంతో.కొంచెం దూరం మాత్రమే జార గలిగింది.

అయితే ఈ కుక్క చేసిన స్కీయింగ్ బాగా నచ్చడం తో నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. 17 సెకండ్ల నిడివి గల ఈ వీడియో ని ఇప్పటికే 66 వేల మంది చూశారు.

ఐదువేల మంది లైక్ చేశారు.
ఇటువంటి అరుదైన సంఘటనలు చూస్తే తమ బాధలు అన్నీ పోతాయి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కొంతమంది ఫన్నీ కామెంట్ చేస్తూ.బెస్ట్ డాగ్ అని బిరుదులు కూడా ఇచ్చేస్తున్నారు.

ఇక పోతే ఈ వీడియో ని ఆస్ట్రియా లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube