శరీరం ఫిట్ గా ఉండాలని ఎంతోమంది ఆరాటపడుతుంటారు.అందుకోసం వేలకు వేలు డబ్బులు పోసి జిమ్ కి వెళ్లడం ,డైట్ ను ఫాలో అవ్వడం, బెస్ట్ ట్రైనర్ సలహా తీసుకోవడం వంటివి చేస్తుంటారు.
అయినా కూడా కొందరిలో మార్పు ఉండదు.శరీరం ఫిట్ గా ఉండాలనుకునేవారు, ఈ కూలి ఫోటో చూస్తే అసూయపడతారు.
ప్రతిరోజు కూలి కోసం ఆరాటపడుతూ కష్టపడే ఇతని ఫిట్ నెస్ చూస్తే డైలీ గంటల తరబడి జిమ్ కి వెళ్లే వాళ్లు కూడా ఇతని ముందు సరిపోరు.
పొట్టకూటి కోసం అతను ప్రతి రోజూ ఎంతో శ్రమించి రోజు కూలీ గా పని చేస్తున్నాడు.
ప్రతిరోజు కష్టపడే వారి శరీరం ఎంతో దృఢంగా, సరైన బ్యాలెన్స్ కలిగి ఉండటం సహజం.అటువంటి వ్యక్తి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సత్య ప్రకాష్ అనే వ్యక్తి తీసిన ఈ ఫోటోను ఆశిష్ సాగర్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.
నిజానికి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి భవన కార్మికుడు.
అతని శరీరం ప్రతిరోజు గంటల తరబడి జిమ్ చేసే వారి శరీరం కన్నా ఎంతో ఫిట్ గా ఉంది.వేల రూపాయలు ఖర్చుపెట్టి తమ శరీరాన్ని కాపాడుకుంటారు.
కానీ తను మాత్రం వంద రూపాయల కోసం కష్టపడే శరీరం ఇతనిది.ఈ ఫోటో షేర్ చేసిన సాగర్ అనే వ్యక్తి స్పందిస్తూ ప్రతిరోజు పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లేవారు సాధారణమైన ఆహారం మాత్రమే తీసుకోవడం వల్ల అతని శరీరం ఇలా దృఢంగా ఉందని కామెంట్ చేశారు.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే కొందరు బడాబాబులు డబ్బులు ఖర్చు చేసి చెమటను చిందిస్తారు.కానీ ఇతను మాత్రం ఇక్కడ చెమటోడ్చి డబ్బులను సంపాదిస్తున్నాడు.శరీర ఫిట్నెస్ గురించి పొగడ్తలు కేవలం ఈ కూలీ కి మాత్రమే చెందుతాయని, అందుకు కేవలం ఇతడు అర్హుడని తెలియజేశారు.అయితే ప్రస్తుతం నెట్టింట్లో ఈ ఫోటో వైరల్ గా మారడంతో, ఆ వ్యక్తిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు.