వైరల్: ఆ గుట్ట ఎక్కిన వారంతా, పసుపు రంగులోకి మారుతున్నారా?

ఆ గుట్ట యొక్క అద్భుతాలు తెలుసుకోవాలసిందే.రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల పరిధిలోని గుంటపల్లి చెరువుకి దగ్గరలో, అంటే సుమారు 3 కిలోమీటర్ల దూరంలో రాసిగుట్ట అనేది ఒకటి ఉంది.

 Viral After All Those Hill ,do They Turn Yellow , Hill , Viral Latest , Viral N-TeluguStop.com

ఇక్కడ అభయాంజనేయ స్వామి ఆలయం కొలువై ఉంది.ఇక్కడ ఆంజనేయ స్వామిని ‘దాసాంజనేయ స్వామి’ అని కూడా పిలుస్తారు.

ఇక్కడి స్వామివారిని దర్శించుకోవాలంటే 3 కిలోమీటర్ల మేర ఉన్న రాసి గుట్టను ఎంతో సహనంతో ఎక్కి స్వామివారిని దర్శించుకుంటే వ్యక్తి శరీరం ముఖ్యంగా కాళ్ళు, చేతులు పసుపు రంగులోకి మారిపోతాయని స్థానిక ప్రజలతో పాటు ఆ గుట్టని దర్శించుకున్న భక్తులు చెబుతున్నారు.

అయితే దీనికి గల కారణాలు మాత్రం ఇంకా తెలిసి రాలేదు.

ఈ రాసి గుట్టపై ఉండే రాళ్లు తేలికగా ఉంటాయట.ఇక వీటిని చిన్నపిల్లలు రాసుకోవడానికి, అలాగే తినడానికి కూడా ఉపయోగిస్తారట.అందుకనే వాటిని రాసి గుట్ట బలపాలు అని పిలుస్తారు.ఇక్కడ శ్రావణమాసం హనుమాన్ జయంతి సమయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.రాజన్న సిరిసిల్ల జిల్లాకు సుమారు 39 కిలోమీటర్ల దూరంలో ఈ రాసి గుట్ట ఉంది.గుట్టపై ఉన్న హనుమంతుడు చాలా శక్తివంతమైన దేవుడిగా ప్రసిద్ధి చెందాడు.

ఇది అతి పురాతనమైన ఆలయం.

Telugu Hanuman, Hill, Rasigutta, Latest, Yellow-Latest News - Telugu

ఇక్కడ స్వామివారిని దర్శించుకొని కోరికలు కోరుకుంటే తప్పనిసరిగా తీరుతాయని అక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం.దీనికి ఓ చరిత్ర కూడా వుంది.హనుమంతుడు సంజీవని పర్వతం మోసుకెళ్తున్న క్రమంలో ఓ చిన్న ముక్క జారిపడి అక్కడ ఓ కొండగట్టుగా వెలిసిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

ఈ గుట్టపై రాళ్లు జాదు రంగులో ఉంటాయి.ఎంతో శక్తివంతమైన హనుమంతుని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు.అయితే సౌకర్యాలు ఇక్కడ అంతగా లేకపోవడం కొద్ది సమస్యగా మారిందని అక్కడి భక్తులు చెబుతున్నారు.అందువలన ప్రభుత్వం కల్పించుకొని దాన్ని పర్యాటక కేంద్రంగా మార్చితే మరింత అభివృద్ధి చూస్తామని అక్కడి ప్రజలు, భక్తులు తమ ఆశను వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube