వైరల్: అరుదైన దృశ్యం... భారతీయులతో కలిసి స్టెప్పులేస్తున్న బ్రిటీష్ పోలీస్!

లండన్‌లోని( London ) భారత హై కమిషన్ కార్యాలయంపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడికి పాల్పడి, భారతీయ జాతీయ జెండాను కిందికి దించి వారి జెండాను ఎగిరేసేందుకు అత్యుత్సాహం చూపారు.ఇలా ఇండియన్ హై కమిషన్ ఆఫీసుపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడి చేయడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అవడం మనకు తెలిసినదే.

 Viral A Rare Sight British Police Stepping With Indians ,viral, Latest News, Vi-TeluguStop.com

పంజాబ్‌లో ‘వారిస్ పంజాబ్ దే‘ సంస్థ నాయకుడు అమృత్‌పాల్ సింగ్( Amritpal Singh ) కోసం పోలీసులు వెతుకుతుండటం, అతని మద్దతుదారులను అదుపులోకి తీసుకుంటున్న నేపథ్యంలో లండన్‌లో పలువురు ఖలిస్తానీ మద్దతుదారులైన సిక్కులు నిరసనలు తెలపడం జరిగింది.

ఈ నేపథ్యంలోనే భారత హై కమిషన్ కార్యాలయం​వద్దకు చేరుకుని, భవనంపై ఉన్న త్రివర్ణ పతాకాన్ని( Tricolor flag ) తొలగించారు.దాంతో ధీటుగా స్పందించిన హైకమిషన్ అధికారులు ఓ పెద్ద జాతీయ జెండాను ఆఫీస్ ముందు కట్టడం జరిగింది.ఇదిలా ఉంటే.

ఖలిస్తాన్ మద్దతుదారుల దాడిని వ్యతిరేకిస్తూ… హై కమిషన్ భవనం ముందు భారతీయ కమ్యూనిటీ వారు తాజాగా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా నిక్ అనే ఓ బ్రిటీష్ పోలీస్ అధికారి భారతీయ ఆందోళనకారులతో కలిసి సరదాగా బాలీవుడ్ పాటకు స్టెప్పులు వేశారు.

దీనికి సంబంధించినటువంటి వీడియోను సిద్దాంత్ సిబల్ అనే ట్విటర్ యూజర్ షేర్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్ అవుతోంది.పోలీస్‌ అధికారికి ఓ భారతీయ యువతి పాటకు తగ్గట్టుగా స్టెప్పులు నేర్పడం ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు.కాగా, భారతీయుల ఐక్యతకు ఈ నిరససనలు ఓ ప్రతీక అని, తమపై దాడి జరిగిన ప్రతీసారి రెట్టింపు సంఖ్యలో వచ్చి ఇలా మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా భారత సంతతికి చెందిన ఓ మహిళ పేర్కొనడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube