తెలుగు సినిమా నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడానికి కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగులో మంచి కాన్సెప్ట్ లను ఎంచుకుంటూ వరుసగా మంచి సినిమాలు చేసి మంచి గుర్తింపు పొందిన హీరో ల్లో విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) ఒకరు.
ఈయన ప్రస్తుతానికి ఫ్లాపుల్లో ఉన్నాడు అందువల్ల ఇప్పుడు వచ్చే రెండు సినిమాలు ఆయన కెరియర్ కి చాలా కీలకంగా మారనున్నాయి.
ఎందుకంటే ఆయన చేసే సినిమాలు మంచి సినిమాలైనప్పటికి ఆయనకు పెద్దగా గుర్తింపు అయితే రావడం లేదు.సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ అవడం లేదు.అందుకే తను గేరు మార్చి మంచి సినిమాలుచేయాలనే ఉద్దేశంతోనే తను డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లను చేస్తున్నట్టు గా తెలుస్తుంది.
ఇక పరుశురాం డైరెక్షన్ ( Director Parasuram )లో చేస్తున్న ఫ్యామిలీ మన్ గాని గౌతమ్ తిన్ననూరు( Gowtam Tinnanuri ) డైరెక్షన్ లో చేస్తున్న సినిమా గాని ఈ రెండు సినిమాల మీదనే ఆయన భారీ ఆశలను పెట్టుకున్నట్లు గా తెలుస్తుంది.ఈ రెండు సినిమాల్లో రెండు సినిమాలు సక్సెస్ అయితే మాత్రం ఆయన మార్కెట్ విపరీతంగా పెరుగుతుంది లేదా ఒక సినిమా సక్సెస్ అయిన కూడా ఆయనకు మార్కెట్ అనేది ఇండస్ట్రీలో భారీగా పెరుగుతుంది.
కానీ రెండు సినిమాలు బోల్తా కొడితే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ప్రస్తుతం ఆయన ఉన్న ఇమేజ్ ను బట్టి ఆయన ఒక స్టార్ హీరో రేంజ్ లో ఉన్నాడు.అయినప్పటికీ సక్సెస్ లేకపోవడం వల్ల రోజు రోజుకి ఆయన మార్కెట్ తగ్గుకుంటూ వస్తుంది.ఇప్పుడు కనక సక్సెస్ పడకపోతే మాత్రం తను కూడా బి గ్రేడ్ హీరో లా ఉండిపోవలసి వస్తుంది…నిజానికి ఈయన చేసిన చాలా సినిమాలు మధ్యలో బోల్తా కొట్టాయి అందువల్లనే ఆయన స్టార్ హీరో గా ఎదగలేకపోయాడు…
.