తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, పూజ హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బీస్ట్.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 13 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.విడుదలకు ముందు చిత్ర బృందం సినిమాపై ఎన్నో అంచనాలు పెంచినప్పటికీ విడుదలైన తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక పోయిందని చెప్పాలి.
ఈ సినిమాలో కథ యాక్షన్ సన్నివేశాలు అన్ని బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు మరిన్ని కసరత్తులు చేసి ఉంటే సినిమా అద్భుతంగా వచ్చి ఉండేదని ఈ సినిమా పై రివ్యూ ఇచ్చారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ పై హీరో విజయ్ దళపతి తండ్రి చంద్రశేఖర్ ఒక తమిళ మీడియాతో ముచ్చటిస్తూ లైవ్‌లోనే నెల్సన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీస్ట్ సినిమా కేవలం తన కొడుకుకి ఉన్న క్రేజ్ వల్ల వసూళ్లను రాబట్టిందని లేకపోతే ఈ సినిమా నిర్మాతలు నష్టపోవాల్సి వచ్చేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు, వాటి మిషన్.ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్‌ని సెలక్ట్ చేసుకున్నప్పుడు స్క్రీన్‌ప్లేతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయవచ్చు.కానీ స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ విఫలమయ్యారని విజయ్ తండ్రి చంద్రశేఖర్ దర్శకుడిపై ఘాటు విమర్శలు చేశారు.
ఇక ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు అనిరుధ్, ఫైట్ మాస్టర్స్, ఎడిటర్స్,డాన్స్ మాస్టర్ అందరూ ఎంతో అద్భుతంగా పని చేశారని పేరుపేరునా వారి పై ప్రశంసలు కురిపించిన చంద్రశేఖర్ నెల్సన్ దిలీప్ కుమార్ పేరు ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.