వీడియో: బంతితో ఆడుకుంటూ కెమెరాకి చిక్కిన పెద్దపులి..

సాధారణంగా పెద్ద పిల్లలు చాలా సీరియస్‌గా కనిపిస్తాయి.అవి ఎప్పుడూ ఏదో ఒక జంతువును వెంటాడుతూ వాటిని చంపేస్తూ బీకరమైన రూపంలో దర్శనమిస్తాయి.

 Video: Tiger Caught On Camera Playing With A Ball. , Viral News, Latest News, Tr-TeluguStop.com

అయితే ఈ పులులలో ఇంకొక కోణం కూడా ఉంది.అదే చిన్నపిల్లల లాగా ఆడుకోవడం.

వీటికి కూడా మనుషుల లాగానే సరదాగా ఆడుకుంటూ కాలక్షేపం చేయాలని ఉంటుంది.ఇప్పటికే చాలా క్రూర మృగాలు చిన్నపిల్లల్లాగా ఆడుకుంటూ కెమెరాకి చిక్కాయి.

ఇప్పుడు ఒక పెద్ద పులి ఒక పెద్ద బంతితో నీటిలో పడి ఆడుకుంటూ కెమెరా కంటపడింది.

నేచర్ ఇస్ అమేజింగ్ అనే ట్విట్టర్( Twitter ) పేజీ ఈ వీడియోను షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 50 లక్షలు దాకా వ్యూస్ వచ్చాయి.వీడియోలో ఒక నీటిలో పడ్డ బంతిని( Ball ) ఒక పెద్ద పులి తన పంజాతో పట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ ఆడుకోవడం చూడవచ్చు.

ఈ పులి బంతిని నీటిలో ముంచుతామని ప్రయత్నించింది.కానీ అందులో ఎయిర్ ఉండటం వల్ల అది మునగ లేదు.అందుకే మళ్లీ మళ్లీ ప్రయత్నించింది కానీ విఫలమయ్యింది.అయితే చాలా ఫన్ మాత్రం పొందగలిగింది.

ఏదో చిన్న పిల్లి లాగా ఈ పులి( Tiger ) బంతిని పట్టుకొని ఆటాడుకోవడం చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.క్యాట్ జాతికి చెందిన చిరుత అయినా, పులి అయినా, వాటికి ఎంత పెద్ద వయసు వచ్చినా ఇలానే ఆడుకుంటాయని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు.వాటిలో చిలిపితనం ఎప్పుడూ ఒకేలాగా ఉంటుందని మరికొందరు అన్నారు.అవి అంత పెద్దగా పెరిగినా చిన్నపిల్లల లాగానే ప్రవర్తిస్తాయని ఇంకొందరు కామెంట్లు చేశారు.ఈ పులి ఇలా చిన్న పిల్లలాగా ఆడుకోవడం జింకలు గనుక చూస్తే కడుపుబ్బా నవ్వుకుంటాయని ఒక నెటిజెన్ ఫన్నీగా కామెంట్ పెట్టాడు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube