ఘనంగా వరుణ్ తేజ్ లావణ్య సంగీత్ వేడుక... స్పెషల్ అట్రాక్షన్ గా బన్నీ, చరణ్ దంపతులు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి వరుణ్ తేజ్ ( Varun Tej ) లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati ) మరొక రోజులో పెళ్లి పీటలేకపోతున్నటువంటి నేపథ్యంలో వీరి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి.ఇక వీరి వివాహం ఇటలీలో జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మెగా, అల్లు, కామినేని కుటుంబ సభ్యులందరూ కూడా ఇటలీ చేరుకొని పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

 Varun Tej And Lavanya Sangeeth Party Photos Goes Viral, Lavanya Tripati, Varunte-TeluguStop.com

ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి మూడు రోజులపాటు ఎంతో ఘనంగా జరగబోతుంది అక్టోబర్ 30వ తేదీ నుంచి వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయని తెలుస్తుంది.

Telugu Allu Arjun, Lavanya Tripati, Ramcharan, Varuntej-Movie

ఇలా అక్టోబర్ 30వ తేదీ రాత్రి వరుణ్ తేజ్ లావణ్యల సంగీత్( Sangeeth ), కాక్ టైల్ ( Cock Tail ) పార్టీ చేసుకున్నారు.దీంతో ఈ పార్టీలోని కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.ఈ ఫొటోల్లో అల్లు అర్జున్(Allu Arjun), స్నేహారెడ్డి(Sneha Reddy).

అలాగే చరణ్(Charan), ఉపాసన (Upasana ) దంపతులు వరుణ్ లావణ్యకు కంగ్రాట్స్ తెలుపుతూ ఫోటోలు దిగారు. ఇక ఈ వేడుకలో ఈ ఇద్దరు హీరోల దంపతులు ఎంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారని చెప్పాలి.

ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానులు ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు.

Telugu Allu Arjun, Lavanya Tripati, Ramcharan, Varuntej-Movie

ఇలా నిన్నటి నుంచే వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి వేడుకలు మొదలవడంతో మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషంగా ఆటపాటలతో ఈ పెళ్లి వేడుకలలో ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తుంది.ఇక నేడు ఉదయం హాల్ది వేడుక జరగగా సాయంత్రం మెహందీ వేడుక జరగబోతున్నట్లు తెలుస్తోంది.ఇలా ఒకటవ తేదీ మధ్యాహ్నం పెళ్లి రాత్రి రిసెప్షన్ కార్యక్రమాలు జరగబోతున్నాయి.

మూడు రోజులపాటు ఎంతో అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుకలు జరగబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ జంట వివాహం తర్వాత ఇటలీ నుంచి చేరుకున్నాక ఇక్కడ కూడా నవంబర్ 5వ తేదీ గ్రాండ్గా రిసెప్షన్ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube