నార్మల్‌గా పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరు కొలను లేదా చెరువుల వద్దకు వెళ్లి చేపలు పడుతుండటం మనం చూడొచ్చు.జాలర్లు మాత్రమే కాకుండా నార్మల్ పర్సన్స్ సైతం వలలు తయారు చేసుకుని ఫిషింగ్ చేయడం మనం గమనించొచ్చు.
అయితే, అందరికీ వలలో చేపలు చిక్కడం కష్టమే.ఈ క్రమంలోనే కొందరు టైం పాస్ కోసం అలా చేపలు పట్టేందుకు వస్తుంటారు.
ఇకపోతే వల ఎలా ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది.దానిలో చేపల కోసం ఎర వేసి అవి వాటి కోసం వచ్చిన సమయంలో పట్టుకుంటు ఉంటారు.
తాజాగా ఫిషింగ్‌కు సంబంధించిన ఓ భయంకరమైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.సదరు వీడియోలో వల ద్వారా చేపకు బదులుగా వారు దేనని పట్టుకున్నారంటే.
సదరు వైరల్ వీడియోలో కొలనులో వలగా చిన్న కర్రకు కొక్కెం తగిలించి వేశారు ఇద్దరు యువకులు.అంతే ఆ ఎరను పట్టుకునేందుకుగాను వేగంగా సముద్రపు అలెగ్జాండర్ బయటకు వచ్చేసింది.
అయితే, మొసలిని చూడగానే నార్మల్‌గా అందరు భయపడిపోతుంటారు.

ఎందుకంటే చాలా బలం ఉన్న జీవి ముసిలి కాగా, అది పట్టు పట్టిందంటే ప్రాణాలు పోవాల్సిందే.కాగా, మొసలిని చూసి సదరు యువకులు భయపడకుండా ఎరను బయటకు లాగుతూ మొసలిని కొలను నుంచి బయటకు తీసుకొచ్చారు.అలా మొసలిని కొలను నుంచి తీసుకొచ్చేందుకు ఎరను బయటకు లాగుతుండగా, మొసలి కూడా ఎరతో బయటకు వచ్చేస్తుంది.
వీడియోను క్షుణ్ణంగా పరిశీలిస్తే సదరు యువకులు చేపల కోసం కాకుండా మొసలి కోసమే ఎరను వేసినట్లు అర్థమవుతున్నది.సదరు యువకులు ప్రీ ప్లాన్‌డ్‌గా వలను మొసలి కోసమే వేసి దానిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే, ఈ వీడియోను కొత్త వారు ఎవరైనా చూస్తే తప్పకుండా భయపడిపోతారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.