ఆమెనే నా రోల్ మోడల్ అంటున్న ఐశ్వర్య!

ఐశ్వర్య రాజేష్ ఎంత కష్టమైన పాత్ర అయినా అవలీలగా చేయగలుగుతుంది.

ఈమె టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ గా నటించిన మళ్ళీ హీరోయిన్ గా కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.ఐశ్వర్య రాజేష్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో సువర్ణ పాత్రలో నటించి బాగా గుర్తింపు సంపాదించుకుంది.

ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

ఈ మధ్య నాని నటించిన టక్ జగదీష్ సినిమాలో కూడా నటించి మెప్పించింది.ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించి అభిమానులను అలరించింది.ప్రెసెంట్ ఈ బ్యూటీ తెలుగులో వచ్చిన అవకాశాలను అందుకుంటూనే తమిళంలో స్టార్ హీరోయిన్ గా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

Advertisement

ఇక ఈ బ్యూటీ సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమాతో మరొకసారి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అయ్యింది.ఈ సినిమా ప్రమోషన్స్ లో ఐశ్వర్య రాజేష్ బిజీగా ఉంది.

మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో మీ రోల్ మోడల్ ఎవరు? అనే ప్రశ్న ఎదురైంది.ఈ ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ.

నాకు సౌందర్య అంటే చాలా ఇష్టం.ఆమె ఎంత సింపుల్ గా ఉండే పాత్రలో అయినా చాలా అందంగా కనిపించేవారు.

అంతేకాదు సౌందర్య గారు ఎలాంటి పాత్ర అయినా ఒదిగిపోయి చేయగలిగే తీరు నాకు ఎంతగానో నచ్చుతుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అయితే ఇప్పటి హీరోయిన్లలో సమంత గారు అంటే నాకు చాలా ఇష్టం అని ఐశ్వర్య రాజేష్ తెలిపారు.సమంత అద్భుతంగా నటించడమే కాకుండా అందంగా, అమాయకంగా ఉంటూ తన నటనతో ఆకట్టుకుంటుంది.ఎలాంటి పాత్రలోనైనా యిట్టె నటించి మెప్పించ గలుగుతుంది.

Advertisement

ఆమె కెరీర్ లో ఎదిగిన తీరును నాకు ఆదర్శం అంటూ ఐశ్వర్య చెప్పుకొచ్చింది.ఇక రిపబ్లిక్ సినిమాలో ఆమె నటించే పాత్ర మంచి పేరు తెస్తుందని నమ్మకంగా ఉంది ఈ బ్యూటీ.

తాజా వార్తలు