అమెరికాలో భారత సంతతి మహిళ గీతా రావు గుప్తాకు( Geeta Rao Gupta ) కీలక పదవి దక్కింది.విదేశాంగ శాఖలో గ్లోబల్ ఉమెన్స్ ఇష్యూకు ‘‘అంబాసిడర్ ఎట్ లార్జ్’’గా గీత నియామకానికి యూఎస్ సెనేట్ ఆమోదముద్ర వేసింది.
యూఎస్ విదేశాంగ విధానం ద్వారా మహిళలు, బాలికల హక్కులను ప్రోత్సహించడానికి ఆమె చేసే ప్రయత్నాల కోసం ఎదురుచూస్తున్నట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ శుక్రవారం ఒక ట్వీట్‌లో తెలిపింది.ఈ వారం ప్రారంభంలో సెనేట్‌లో జరిగిన ఓటింగ్ సందర్భంగా గీతా రావు నియామకానికి 51:47 ఓట్ల తేడాలో ఆమోదం లభించింది.గీతా రావు ప్రకారం.ప్రపంచవ్యాప్తంగా మహళలు ఎన్నో అసమానతలు, అవమానాలు ఎదుర్కొంటున్నారు.భద్రత విషయంలో ఎన్నో బెదిరింపులకు గురవ్వడంతో పాటు హింసకు కూడా స్త్రీలు భయపడుతున్నారని గీత ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకపోతే.మహారాష్ట్ర( Maharashtra )లోని ముంబైలో పుట్టారు గీతా.ముంబై, ఢిల్లీలలో ఆమె పరిగారు.
యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, బెంగళూరు యూనివర్సిటీల్లో గీతా రావు విద్యాభ్యాసం చేశారు.బెంగళూరు యూనివర్సిటీ నుంచి సోషల్ సైకాలజీలో ఆమె పీహెచ్‌డీ చేశారు.
అనంతరం పలు విశ్వవిద్యాలయాల్లోని సైకాలజీ విభాగాల్లో పనిచేశారు.టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో పనిచేస్తుప్పుడు దేశంలోనే తొలిసారిగా ఉమెన్స్ స్టడీస్ కారిక్యులమ్‌ను గ్రాడ్యుయేట్ విద్యార్ధుల కోసం ప్రవేశపెట్టడంలో గీత కీలకపాత్ర పోషించారు.1980ల ప్రాంతంలో అమెరికాకు వెళ్లిన గీతా రావు.ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్ (ఐసీఆర్‌డబ్ల్యూ)లో చేరి పలు హోదాల్లో పనిచేశారు.
కాగా.గతవారం ఇండో అమెరికన్ మహిళ నీరా టాండన్( Neera Tanden )ను తన పాలసీ అడ్వైజర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) తన దేశీయ విధాన ఎజెండాను రూపొందించడంతో పాటు అమలు చేయడంలో నీరా ఆయనకు సలహాలు ఇస్తారని బైడెన్ తెలిపారు.ఎకనమిక్ మొబిలిటీ, జాతి సమానత్వం, ఆరోగ్య సంరక్షణ, వలసలు, విద్య వంటి వాటిలో నీరాకున్న అనుభవం ఉపయోగపడుతుందని ఆయన ఆకాంక్షించారు.ఇప్పటి వరకు ఈ స్థానంలో సుసాన్ రైస్ విధులు నిర్వర్తించారు.