H1B వర్కర్స్‌కు షాక్.. యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఫీజు 2050% పెంచవచ్చు..

యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(USCIS) యునైటెడ్ స్టేట్స్‌కు వచ్చే వర్కర్లకు షాక్ ఇచ్చింది.ఈ వర్కర్స్‌కు ఇమ్మిగ్రేషన్ ఫీజులు భారీగా పెంచాలనే ఆలోచనలను మొదలుపెట్టింది.

 Us May Hike The Fee For A Critical H 1b Visa Step By 2050 Percent In 2024-TeluguStop.com

కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందుల ఏర్పడిన వేళ ఆదాయం పెంచుకోవాలని USCIS ఫీజులు పెంచాలని చూస్తోంది.తన ఫీజు స్ట్రక్చర్‌ను పూర్తిగా రివ్యూ చేసే దిశగా అడుగులు వేస్తోంది.

దీనివల్ల H-1B వీసాలు( H-1B Visa ) గ్రీన్ కార్డ్ అప్లికేషన్‌లతో సహా అనేక రకాల సేవలు ప్రభావితమవుతాయి.పబ్లిక్ ఫీడ్‌బ్యాక్ సమయంలో ఈ ప్రతిపాదనకు చాలామంది నుంచి వ్యతిరేకత వచ్చింది.కొత్త ఫీజు షెడ్యూల్ జనవరి 2024 నాటికి నిర్ధారించబడుతుంది.60-90 రోజులలోపు అమలు చేయబడుతుంది.2016 నుంచి ఏజెన్సీ ఆపరేషన్ కాస్ట్స్ కూడా తిరిగి పొందలేకపోతోంది.ఇకపై ఆ ఖర్చులను కవర్ చేయడమే లక్ష్యంగా ఫీజులు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

పెంచిన ఫీజులు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.

• H-1B E-రిజిస్ట్రేషన్: ఫీజు 10 డాలర్ల నుంచి 215 డాలర్ల వరకు పెరుగుతుంది, అంటే 2050% పెరుగుదల.

Telugu Eb Visa, Visa, Visa Fee, Hb, Fees, Fee Structure, Nri, Citizenship, Green

• H-1B వీసా దరఖాస్తు: ఫీజు 460 డాలర్ల నుంచి 780 డాలర్లకి పెరగవచ్చు, ఇది 70% పెరుగుదల.

• L వీసా (ఇంట్రా-కంపెనీ బదిలీ): ఫీజు 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకి 201% పెరగవచ్చు.

• EB-5 ఇన్వెస్టర్ వీసా (ప్రారంభ పిటిషన్): ఫీజు 3,675 డాలర్ల నుంచి 11,160 డాలర్లకి వరకు 204% పెంపును చూడవచ్చు.

• EB-5 ఇన్వెస్టర్ వీసా:( EB-5 Investor Visa ) ఫీజు 3,835 డాలర్ల నుంచి 9,525 డాలర్లకి 148% పెరగవచ్చు.

Telugu Eb Visa, Visa, Visa Fee, Hb, Fees, Fee Structure, Nri, Citizenship, Green

• ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ (ఆన్‌లైన్): ఫీజు 410 డాలర్ల నుంచి 555 డాలర్లకి 35% పెరగవచ్చు.

• ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ (పేపర్ ఫైలింగ్): ఫీజు 410 డాలర్ల నుంచి $650కి 59% పెరగవచ్చు.

• గ్రీన్ కార్డ్ స్థితి సర్దుబాటు: ఫీజు $1,225 నుంచి 1,540 డాలర్లకి 26% పెరగవచ్చు.

• పౌరసత్వ దరఖాస్తు: ఫీజు 640 డాలర్ల నుంచి 760 డాలర్లకి 19% పెరగవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube