H1B వర్కర్స్‌కు షాక్.. యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఫీజు 2050% పెంచవచ్చు..
TeluguStop.com
యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(USCIS) యునైటెడ్ స్టేట్స్‌కు వచ్చే వర్కర్లకు షాక్ ఇచ్చింది.
ఈ వర్కర్స్‌కు ఇమ్మిగ్రేషన్ ఫీజులు భారీగా పెంచాలనే ఆలోచనలను మొదలుపెట్టింది.కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందుల ఏర్పడిన వేళ ఆదాయం పెంచుకోవాలని USCIS ఫీజులు పెంచాలని చూస్తోంది.
తన ఫీజు స్ట్రక్చర్‌ను పూర్తిగా రివ్యూ చేసే దిశగా అడుగులు వేస్తోంది.దీనివల్ల H-1B వీసాలు( H-1B Visa ) గ్రీన్ కార్డ్ అప్లికేషన్‌లతో సహా అనేక రకాల సేవలు ప్రభావితమవుతాయి.
పబ్లిక్ ఫీడ్‌బ్యాక్ సమయంలో ఈ ప్రతిపాదనకు చాలామంది నుంచి వ్యతిరేకత వచ్చింది.కొత్త ఫీజు షెడ్యూల్ జనవరి 2024 నాటికి నిర్ధారించబడుతుంది.
60-90 రోజులలోపు అమలు చేయబడుతుంది.2016 నుంచి ఏజెన్సీ ఆపరేషన్ కాస్ట్స్ కూడా తిరిగి పొందలేకపోతోంది.
ఇకపై ఆ ఖర్చులను కవర్ చేయడమే లక్ష్యంగా ఫీజులు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పెంచిన ఫీజులు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.• H-1B E-రిజిస్ట్రేషన్: ఫీజు 10 డాలర్ల నుంచి 215 డాలర్ల వరకు పెరుగుతుంది, అంటే 2050% పెరుగుదల.
"""/" /
• H-1B వీసా దరఖాస్తు: ఫీజు 460 డాలర్ల నుంచి 780 డాలర్లకి పెరగవచ్చు, ఇది 70% పెరుగుదల.
• L వీసా (ఇంట్రా-కంపెనీ బదిలీ): ఫీజు 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకి 201% పెరగవచ్చు.
• EB-5 ఇన్వెస్టర్ వీసా (ప్రారంభ పిటిషన్): ఫీజు 3,675 డాలర్ల నుంచి 11,160 డాలర్లకి వరకు 204% పెంపును చూడవచ్చు.
• EB-5 ఇన్వెస్టర్ వీసా:( EB-5 Investor Visa ) ఫీజు 3,835 డాలర్ల నుంచి 9,525 డాలర్లకి 148% పెరగవచ్చు.
"""/" /
• ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ (ఆన్‌లైన్): ఫీజు 410 డాలర్ల నుంచి 555 డాలర్లకి 35% పెరగవచ్చు.
• ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ (పేపర్ ఫైలింగ్): ఫీజు 410 డాలర్ల నుంచి $650కి 59% పెరగవచ్చు.
• గ్రీన్ కార్డ్ స్థితి సర్దుబాటు: ఫీజు $1,225 నుంచి 1,540 డాలర్లకి 26% పెరగవచ్చు.
• పౌరసత్వ దరఖాస్తు: ఫీజు 640 డాలర్ల నుంచి 760 డాలర్లకి 19% పెరగవచ్చు.
సస్పెన్స్‌కు తెర.. హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ.. షెడ్యూల్ ఇలా