సామాజిక సేవకై జీవితం అంకితం.. భారత సంతతి వ్యక్తికి బ్రిటన్ రాజకుటుంబం సత్కారం

UK Indian Origin Awarded The Title Of Coronation Champion By King Charles III Details, UK Indian Origin , Coronation Champion ,King Charles III , Queen Camilia, Uk Rajesh Jain, Uk Royal Family, Jain Vishwa Bharati London, Jain International Trade Organization

సామాజిక సేవ, శ్రేయస్సుకై పాటుపడిన భారత సంతతి వ్యక్తిని యూకే రాజకుటుంబం సత్కరించింది.ఈ మేరకు కింగ్ చార్లెస్ III, క్వీన్ కెమిల్లా చేతుల మీదుగా ‘Coronation Champion’ను అందుకున్నారు గుజరాత్‌కు చెందిన రాజేశ్ జైన్.

 Uk Indian Origin Awarded The Title Of Coronation Champion By King Charles Iii De-TeluguStop.com

( Rajesh Jain ) ఇటీవల బకింగ్ హామ్ ప్యాలెస్‌లో గార్డెన్ పార్టీకి హాజరుకావాల్సిందిగా రాజేశ్ దంపతులకు ఆహ్వానం అందింది.

Telugu Jainvishwa, Charles Iii, Queen Camilia, Uk Rajesh Jain, Uk Royal-Telugu N

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పుట్టి పెరిగారు రాజేష్ జైన్.అతని తల్లిదండ్రులు సాగర్మల్ జైన్, రాజ్‌కుమారి జైన్. నగరంలోని వల్లభ్ విద్యానగర్‌లోని బీవీఎం ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు.

అంతకుముందు నగరంలోనే పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆయన.అనంతరం సూరత్‌లో ఎంబీఏ పట్టా పొందారు.అహ్మదాబాద్ ఎలక్ట్రిసిటీ కంపెనీలో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన.అనంతరం Batliboi & Co , Larsen & Toubro Ltd వంటి అగ్రశ్రేణి కంపెనీల్లో పనిచేశారు.ఈ రంగంలో అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకున్న రాజేష్ జైన్. అనంతరం సొంతంగా యూకేలో కన్సల్టెన్సీ వ్యాపారాన్ని ప్రారంభించారు.ఆపై అక్కడే 23 ఏళ్లుగా భార్య, కుమార్తెతో నివసిస్తున్నారాయన.

Telugu Jainvishwa, Charles Iii, Queen Camilia, Uk Rajesh Jain, Uk Royal-Telugu N

ప్రస్తుతం యూఎస్, యూకే, మిడిల్ ఈస్ట్, భారత్‌లోని పలు ప్రముఖ సంస్థల కోసం జైన్ కంపెనీ పనిచేస్తోంది.అలాగే యూకేలోని( UK ) జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జేఐటీవో) బోర్డు సభ్యునిగానూ రాజేష్ పనిచేస్తున్నారు.అనంతరం 2012లో జైన్ విశ్వ భారతి లండన్ (జేవీబీ)లో ఆయన వాలంటీర్‌గా చేరి.ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.యువతరంలో నైపుణ్యాన్ని పెంచడంతో పాటు దాదాపు 1000 మంది పిల్లలకు ఉచిత విద్యను( Free Education ) కూడా రాజేష్ జైన్ అందిస్తున్నారు.

ఈ క్రమంలోనే Coronation Champion awards‌కు ఆయనను ఎంపిక చేసింది యూకే రాజకుటుంబం.రాయల్ వాలంటరీ సర్వీస్ ద్వారా ఈ అవార్డ్‌ల ఎంపిక, ప్రధానోత్సవం జరుగుతుంది.తమ కమ్యూనిటీలలో విజయవంతమైన వారిని గుర్తించి ఈ పురస్కారాలను అందజేస్తోంది యూకే రాయల్ ఫ్యామిలీ.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube