యూకే: పెళ్లికి 2-రోజులు సెలవు అడిగిన ఉద్యోగి.. ఇవ్వనన్న బాస్..?

ఈరోజుల్లో వర్క్ కల్చర్ చాలా దారుణంగా మారిందని చెప్పుకోవచ్చు.కొన్ని కంపెనీలు సింగిల్ హాలిడే కూడా ఇవ్వకుండా ఉద్యోగులను బానిసల్లాగా ట్రీట్ చేస్తున్నారు.

 Uk Ceo Faces Backlash After Denying Employees Leave Request Details, Lauren Tick-TeluguStop.com

అనారోగ్యం బారిన పడినా సెలవు ఇవ్వట్లేదు.తాజాగా ఒక కంపెనీ సీఈఓ ఉద్యోగి పెళ్లికి కూడా సెలవులు ఇవ్వలేదు.

వివరాల్లోకి వెళ్తే బ్రిటన్‌లో ఓ లండన్ మార్కెటింగ్ సంస్థ ఉంది.దాని పేరు స్కేల్ సిస్టమ్స్‌.

దీనికి లారెన్ టిక్నర్( Lauren Tickner ) అనే మహిళ సీఈఓగా పనిచేస్తోంది.ఆ కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి తన పెళ్లికి రెండు రోజుల సెలవు అడిగాడు.కానీ, కంపెనీ సీఈఓ లారెన్ టిక్నర్ ఆ సెలవును( Leave ) మంజూరు చేయలేదు.

“ఆ ఉద్యోగి ఇప్పటికే 2.5 వారాలు సెలవు తీసుకున్నాడు.తన పనిని చేసేలా వేరొకరిని శిక్షణ ఇవ్వలేదు.

అందుకే నా ఉద్యోగికి సెలవు ఇవ్వడానికి నేను అంగీకరించలేదు” అని ఆమె తెలిపింది.అయితే, ఆ కంపెనీలో ‘ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులూ సెలవు తీసుకోవచ్చు’ అనే నియమం ఉంది.

కానీ, సీఈఓ( CEO ) తీసుకున్న నిర్ణయం ఈ నియమానికి విరుద్ధంగా ఉందని చాలామంది అనుకుంటున్నారు.

Telugu Ceo, Ceo Deny Leave, Ceo Lauren, Employee Leave, Flexible Time, Lauren, S

కంపెనీ సీఈఓ తన ఉద్యోగికి సెలవు మంజూరు చేయకపోవడానికి కారణం వివరిస్తూ “మా కంపెనీలో రెండు ముఖ్యమైన ప్రాజెక్టులు నడుస్తున్నాయి.ఉద్యోగులు( Employees ) సెలవు మీద వెళ్లే ముందు, వారి పనిని చేసే మరొకరిని ట్రైనింగ్ ఇవ్వాలి.మా కంపెనీలో అన్‌లిమిటెడ్ హాలిడేస్( Unlimited Holidays ) అనే నియమం ఉన్నప్పటికీ, అందరూ అలా చేస్తే పని ఎలా జరుగుతుంది? సదరు ఉద్యోగి ఇంతకు ముందే చాలా రోజులు సెలవు తీసుకున్నారు.కాబట్టి, ఈసారి సెలవు మంజూరు చేయడం కష్టం.మా కంపెనీలో ‘ఫ్లెక్సిబుల్ టైం ఆఫ్’( Flexible Time Off ) అనే నియమం ఉంది.అంటే, మీరు మీకు నచ్చినప్పుడు పని చేయవచ్చు, సెలవు తీసుకోవచ్చు.కానీ, బాగా పని చేసే వారు ఎప్పుడూ సోమరిపోతులను గౌరవించరు.

ఎక్కువ సెలవు తీసుకుంటే మీ మీద ఉన్న గౌరవం తగ్గుతుంది.ఈ నియమం వల్ల మా టీమ్‌లో అందరికీ మధ్య నమ్మకం పెరుగుతుంది.” అని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది.

Telugu Ceo, Ceo Deny Leave, Ceo Lauren, Employee Leave, Flexible Time, Lauren, S

సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన పోస్ట్ కు 30 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.చాలామంది ఆ సీఈఓని తిట్టిపోశారు.“పెళ్లి అనేది మరుపురాని అనుభవం.అలాంటి వేడుక చేసుకునే వాళ్లకు ఎవరైనా సరే సెలవు ఇవ్వాల్సిందే.మీరు ఒకరిని పెళ్లి చేసుకోకుండా ఎలా వర్క్ చేయిస్తారు?” అని బాగా విమర్శించారు.“నువ్వు ఏదో ఘనకార్యం చేసినట్లు నీ నిర్ణయాన్ని ఎందుకు సమర్ధించుకుంటున్నావు” అని కూడా చివాట్లు పెట్టారు.రెండు రోజుల లీవ్ ఇస్తే కొంపలేం మునిగిపోవు అంటూ ఆమెను ఏకి పారేశారు.

అయితే “ఒక ఉద్యోగి వెళ్ళిపోతుంటే వారి స్థానంలో మరొకరిని భర్తీ చేయాల్సిన బాధ్యత వారికి తప్పనిసరిగా ఉంటుంది.వారు తమకు బదులు తమ వర్క్ వేరే వాళ్ళు చేసేలాగా వారికి ట్రైనింగ్ ఇవ్వాలి.

అప్పుడే వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది” అని లారెన్ టిక్నర్ అందరికీ రిప్లై ఇచ్చింది.మొత్తం మీద ఆమె నిర్ణయాన్ని చాలామంది తప్పుపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube