ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు.ట్విట్టర్ ని ఎలాన్ మస్క్( Elon Musk ) ఏ ముహూర్తాన సొంతం చేసుకున్నాడో గాని అప్పటి నుంచి అందులో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
ఈ క్రమంలో ఎన్నో వివాదాలు వస్తూనే వున్నాయి.అంతవరకూ ఓకే గాని, ఇపుడు కొన్ని బడా సంస్థలు ట్విటర్‌ని టార్గెట్ చేయడంలో మునిగిపోయాయి.
ఎందుకంటే ట్విట్టర్ గ్రాఫ్ రోజురోజుకీ పడిపోతుంది కాబట్టి.దీనినే ఆయా కంపెనీలు క్యాష్ చేసుకొనే పనిలో పడ్డాయి.
మరోపక్క ట్విట్టర్ ( Twitter )యూజర్లకు కూడా పాలసీ పరమైన నిబంధనలు రుచించడం లేదు.దీనిపట్ల కొందరు ట్విట్టర్ నుండి బయటకి వచ్చేస్తున్న పరిస్థితి వుంది.దీంతో ప్రత్యామ్నాయ వేదికల వైపు చూస్తున్నారు.ఈ క్రమంలోనే ట్విటర్‌కు పోటీగా మాస్టోడాన్, ట్విటర్ మాజీ బాస్ జాక్ డోర్సీ బ్లూ స్కై వచ్చాయి.ఇప్పుడు తాజాగా ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా సైతం ట్విటర్‌కు పోటీగా కొత్త యాప్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.
అవును, ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్( Instagram ) బ్రాండ్‌పై కొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు మెటా సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో కలిసి మెటా టెస్టింగ్ నిర్వహిస్తోందని కూడా తెలుస్తోంది.అయితే సదరు యాప్‌నకు ఇంకా పేరు పెట్టనప్పటికీ.పీ92, బార్సిలోనా పేర్లతో ఇంటర్నల్‌గా పిలుచుకుంటున్నారు.ఇది సపరేట్ యాప్‌గానే ఉండబోతోందని, అయితే, ఇన్‌స్టా యూజర్లు తమ అకౌంట్‌తో కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పించనున్నారని తెలుస్తోంది.
కాగా ఈ ఏడాది జూన్‌లో సదరు యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.