త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సీరియల్ నటి.. ఎంగేజ్మెంట్ ఫొటోస్ వైరల్?

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.వెండితెర సెలబ్రిటీలతో పాటు బుల్లితెర సెలబ్రిటీలు సైతం ఒక్కొక్కరుగా వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు.

 Tv Actress Vrushika Mehta Engaged Photos Viral Details, Vrushika Mehta, Engegeme-TeluguStop.com

ఇక ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరో నాగ శౌర్య, అలాగే బుల్లితెర నటులు అమర్దీప్ తేజస్విని, కమెడియన్ యాదమ్మ రాజు లు పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే.కేవలం సినీ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా క్రికెటర్లు సైతం పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.

ఈ క్రమంలోని తాజాగా ప్రముఖ నటి తన ప్రియుడుతో ఎంగేజ్మెంట్ను చేసుకుంది.

ఈ నేపథ్యంలోనే అందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

ఆమె మరెవరో కాదు బుల్లితెర నటి రుషికా మెహతా. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో పలు డాన్స్ షోలో ద్వారా బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే డాన్స్ షోలో శంతనుతో కలిసి ఆమె పండించిన కెమిస్ట్రీ బాగా వర్క్ అవ్వడంతో పాటు ప్రేక్షకులను కూడా బాగా ఎంటర్టైన్ చేసింది.ముద్దుగుమ్మ కుంకుమ భాగ్య సీరియల్ లో అతిధి పాత్రలో కనిపించి మెప్పించిన విషయం తెలిసిందే.

సీరియల్స్ తో పాటుగా షోలు అలాగే వెబ్ సిరీస్ లను కూడా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.ఇక కెనడాకు చెందిన తన ప్రియుడు సౌరబ్ ఘోడియాతో త్వరలోనే ఏడడుగులు వేయానుంది.ఈ క్రమంలోని డిసెంబర్ 11న తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని అదే విషయాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా తెలుపుతూ అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.దీంతో ఆమె అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube