భారత్ పై ట్రంప్ ఎదో ఒకరూపంలో కక్ష సాదిస్తున్నాడు.నిన్నా మొన్నటి వరకూ హెచ్ -1బీ , హెచ్ -4 వీసాలపై ట్రంప్ విధించిన ఆంక్షల వేడి ఇంకా చల్లారలేదు.
తమ దేశ పౌరులకి ఉద్యోగాల కల్పన కోసం ట్రంప్ విధించిన షరతులు ఆ దేశ వ్యాపార సంభంద సంస్థలకే విసుగు తెప్పించాయి.ఎంతో మంది ఈ విధానాలని వ్యతిరేకించారు కూడా అయినా ట్రంప్ మాత్రం తన నిర్ణయం వెనక్కి తీసుకోలేదు
అయితే తాజాగా ట్రంప్ తీసుకున్న మరొక నిర్ణయం భారతీయ విద్యార్ధులపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.వివరాలలోకి వెళ్తే.వీసా గడువు ముగిసినా అమెరికాను వీడని విదేశీ విద్యార్థుల వివరాలు తెలుసుకునేలా వీసా నిబంధనలు కఠినతరం చేస్తూ ట్రంప్ ప్రభుత్వం ఇటీవలే ఒక ముసాయిదా విధానాన్ని రూపొందించింది…ఈ కొత్త విధానం ఆగస్టు 9 నుంచి అమల్లోకి రానుంది.
ఈ నిభంధనల ప్రకారం నిర్దేశిత కోర్సు సమయం ముగిసిన రోజు నుంచి లేదా అనుమతించిన గ్రేస్ పీరియడ్ ముగిసినప్పటి నుంచే విద్యార్థులు అక్కడ ఉన్న ప్రతి రోజునూ చట్టవిరుద్ధంగా ఉన్నట్టే భావిస్తారు.ఎలా అంటే ఒక విద్యార్ధి వీసా గడువు ఎదో ఒక నెలలో ముగిస్తే ఆ విద్యార్ధి మూడు నెలలు అక్కడే ఉన్నట్లుగా ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తిస్తే అతడి ఉనికిని చట్టవిరుద్ధంగా పరిగణిస్తున్నారు.
గడువు అయిపోయిన తేదీ నుంచీ 180 రోజుల కన్నా ఎక్కువ రోజులు చట్టవిరుద్ధంగా ఉంటే సదరు విద్యార్థిని డీపోర్ట్ చేసి మళ్లీ 3 నుంచి 10 సంవత్సరాల దాకా అమెరికాకి రాకుండా చేస్తారు.ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతో మంది భారతీయ విద్యార్ధులు వారి తల్లి తండ్రులు అందోళనకి లోనవుతున్నారు.