ట్రంప్ మరో మారు అమెరికాలో ఉండే భారతీయులపై ఉక్కుపాదం మోపడానికి సిద్దమయ్యాడు.ట్రంప్ తీసుకున్న తాజా చర్యలకి “హెచ్ 1-బీ” వీసాదారుల్లో అధికశాతం మంది భారతీయుల్లో కంగారు నెలకొంది.
అమెరికాలో ఉద్యోగాలు చేసి డాలర్లు సంపాదించాలనుకుంటున్న భారత ఐటి నిపుణుల కలలను ట్రంప్ సర్కార్ వమ్ము చేసే చర్యలని కొల్లగొడుతూ ఇప్పటికే ఎన్నో ఆంక్షలని పెట్టిన ట్రంప్ కొత్త నిభంధనలని తెరపైకి తీసుకువచ్చాడు.
ఇందులో భాగంగా ప్రతి అమెరికా కంపెనీ ఇక నుంచి ఎంతమంది విదేశీయులకు హెచ్-1బీ వీసా కింద ఉపాధి కల్పిస్తున్నారో తప్పనిసరిగా వెల్లడించాలని హుకుం జారీ చేశారు.కంపెనీలు విదేశీ ఉద్యోగులను స్పాన్సర్ చేసే నిబంధనలను మరింత కఠినతరం చేయాలనే ఉద్దేశంతో ట్రంప్ సర్కార్ ఈ కొత్త నిబంధనలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.అమెరికా కంపెనీలు.
విదేశీయులకు ఉద్యోగాలను ఇచ్చేందుకు ఈ వీసా రూపంలో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాను జారీ చేస్తూ వస్తున్నాయి.థియరిటికల్ లేదా టెక్నికల్ విభాగాల్లోని వారికి మాత్రమే ఈ తరహా వీసాలను అమెరికా కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి.
అయితే ఈ వీసాల మంజూరులో కూడా అవతవకలు జరుగుతున్నాయని ట్రంప్ సర్కారు భావిస్తుండటంతో కొత్తగా మరో కొన్ని నిబంధనలు రూపొందిస్తోంది.ఈ నిభంధనల ప్రకారం హెచ్-1బీ వీసా కోసం విదేశీ వర్కర్‌కు స్పాన్సర్ చేసే ముందు కార్మిక శాఖ ద్వారా అవసరమైన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.అంతేకాకుండా లేబర్ దరఖాస్తును కంపెనీ కచ్చితంగా ఆమోదించుకోవాల్సి ఉంటుంది.ప్రస్తుత ఉద్యోగానికి అమెరికా ఉద్యోగి లేడని వెల్లడించటంతో పాటు హెచ్-1బీ కింద స్పాన్సర్ చేయబోయే విధేశీ ఉద్యోగికి సంబంధించిన వివరాలను కార్మిక శాఖ సర్టిఫై చేయాల్సి ఉంటుంది…దాంతో అమెరికాలో పని చేసే ప్రతీ కంపెనీకి వివరాలు ప్రభుత్వం చేతిలో ఉంటాయి.
అయితే ఈ కొత్త నిభందనని అతి త్వరలోనే అమలు లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.