అమెరికా అధ్యక్షుడు విధానాలకి విసిగి వేసారిపోయిన అమెరికా ప్రజలు వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు.కొంతమంది రోడ్లపైకి వచ్చి నిరసనలని ఫ్లకార్డ్ ల ద్వారా తెలుపతుంటే మరికొంతమంది వివిధ రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.అయితే ట్రంప్ కి వ్యతిరేకంగా మాత్రం వాషింగ్టన్ లో యాంటీ ట్రంప్ పేరుతో ఒక హోటల్ వెలిసింది.2016లో ట్రంప్ ఎన్నిక తర్వాత ఆ దేశంలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులే ఈ హోటల్ స్థాపనకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
అయితే ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే ట్రంప్‌కు చెందిన ఓ ఫైవ్ స్టార్ హోటల్ పక్కనే దీన్ని నిర్మించారు.దీంట్లో మొత్తం 209 గదులున్న ఈ వర్క్‌షాప్‌లో.హోటల్, హౌస్, మీడియా, వెల్‌నెస్, ఇంపాక్ట్ విభాగాలు ఉన్నాయి.దీని విశిష్టత ఏంటంటే ఆతిథ్యానికి సామాజిక మార్పును జోడించిన ఈటన్ ప్రపంచంలోనే మొట్టమొదటి ‘యాక్టివిస్ట్ హోటల్’ అన్నమాట.
ప్రపంచాన్ని ముందుకు నడిపించాలనుకునే వారికి చోటిచ్చే ఈటన్‌లో.హోటల్ బెడ్ సైడ్ టేబుళ్లపై బైబిల్‌కు బదులుగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటనలు కనిపిస్తాయి.
అంతేకాదు ఇక్కడి బాత్ రూమ్ లు కానీ ఇక్కడ వాడే ప్రతీ వస్తువు పర్యావరణ హితంగానే తాయరయ్యిందట.‘వైల్డ్ డేస్’గా పిలిచే రూఫ్‌టాప్ బార్‌లో.పూర్తిగా శాఖాహార వంటలు మాత్రమే ఉంటాయట.ఇక్కడ మేధోమథనం ద్వారా ఆలోచనలు పంచుకోవచ్చు సమాజానికి ఉపయోగపడే ప్రభావితం చేయగలిగే ప్రతీ ఒక్క ఆలోచనని పంచుకోవచ్చు.
కళలు, సంగీత ధోరణులు, తత్వశాస్త్ర సంబంధిత గ్రంథాలు ఉంటాయి.అంతేకాదు ఉద్యమ కారులకు, ప్రచారకులకు ఉచితంగా మీటింగ్ హాల్ సమకూర్చుతుంది.ఈ హోటల్‌లో ఒక రాత్రి గడపాలంటే కనిష్టంగా 199 డాలర్లు చెల్లించుకోవాలి.