భారతదేశం విభిన్న సంస్కృతులు, జాతులకు నిలయం.అలాగే పురాతన కాలం నుండి అభివృద్ధి చెందిన యుద్ధ కళలకు కూడా ప్రసిద్ధి చెందింది.వాటిలోని 10 యుద్ధ కళల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1.కలరిపయట్టు
ఆవిర్భావం: క్రీ.శ.4 వ శతాబ్దంలో కేరళ రాష్ట్రంలో.కలరిపయట్టులోని అంశాలు: ఉజిచిల్ లేదా జింగ్లీ నూనెతో మసాజ్, ఒట్టా, మైపయట్టు లేదా శరీర వ్యాయామాలు, పులియంకం లేదా కత్తి యుద్ధం, వెరుంకై లేదా బేర్ హ్యాండ్ ఫైట్ మొదలైనవి.కలరి అనేది మలయాళ పదం, దీని అర్థం పాఠశాల వ్యాయామశాల శిక్షణా మందిరం.ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ బోధిస్తారు.కలరిపయట్టు అనేది దేవాలయాలను నిర్మించిన పురాణ, ఋషి పరశురాముని యుద్ధ కళగా చెబుతారు.ఈ కళ నిరాయుధ ఆత్మరక్షణ సాధనంగా, శారీరక దృఢత్వాన్ని సాధించే మార్గంగా ఉపయోగపడుతోంది.
2.సిలంబం
మూలం: తమిళనాడులో, ఆధునిక మరియు శాస్త్రీయ యుద్ధ కళ.సిలంబంలోని మెళకువలు: పాదాల వేగవంతమైన కదలికలు, థ్రస్ట్ ఉపయోగించడం, కట్, చాప్, స్వీప్ చేయడంలో నైపుణ్యం, బలాన్ని పెంచుకోవడం.తమిళనాడులో పాండ్య, చోళ, చేరా పాలకులచేత సిలంబం ప్రచారం అయ్యింది.
దీనిలో మాక్ ఫైటింగ్, సెల్ఫ్ డిఫెన్స్ కోసం లాంగ్ స్టాఫ్ టెక్నిక్ ఉపయోగిస్తారు.
3.తంగ్-టా,సరిత్ సరక్
ఉద్భవించినది: ఈ కళను మణిపూర్‌లోని మెయిటీ ప్రజలు సృష్టించారు.థాంగ్ అనేది ‘కత్తి’ని సూచిస్తుంది.
టా అనేది ‘ఈటె’ను సూచిస్తుంది.ఇది సాయుధ యుద్ధ కళ.అయితే సరిత్ సరక్ అనేది నిరాయుధ కళారూపం.17 వ శతాబ్దంలో ఈ కళను మణిపురి రాజులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉపయోగించారు.ఆ తర్వాత బ్రిటీషర్లు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ మార్షల్ ఆర్ట్స్‌ను నిషేధించారు.థాంగ్-టాను హుయెన్‌లాలాంగ్ అని కూడా పిలుస్తారు.ఇది ఒక ప్రసిద్ధ పురాతన యుద్ధ కళ.దీనిలో గొడ్డలి,కవచం ఉపయోగిస్తారు.
4.తోడా
మూలం: హిమాచల్ ప్రదేశ్,తోడా అనేది ప్రాణాంతక సామర్థ్యాన్ని తగ్గించడానికి ఉపయోగించే యుద్ధ కళ.క్రీడ, సంస్కృతుల మిశ్రమం.ఇది ప్రతి సంవత్సరం బైసాఖి సమయంలో జరుగుతుంది.ఈ యుద్ధ కళ ఒక క్రీడాకారుడి విలువిద్య నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది.
5.గట్కా
మూలం: పంజాబ్గట్కా అనేది పంజాబ్‌లోని సిక్కులు ప్రదర్శించే ఆయుధ ఆధారిత యుద్ధ కళ.గట్కా అంటే ఎవరి స్వేచ్ఛ వారికుందని అర్థం.మరికొందరు గట్కా అనేది సంస్కృత పదం గాధా నుండి వచ్చిందని చెబుతారు.ఈ కళలో కిర్పాన్, తల్వార్, కతార్ వంటి ఆయుధాలను ఉపయోగిస్తారు.ఇది వివిధ సందర్భాలలో, జాతరలతో సహా రాష్ట్రంలోని వేడుకలలో ప్రదర్శిస్తుంటారు.