టైం మ్యాగజైన్ గురించి ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు.ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులని ఎంపిక చేసి వారి సేవలని వారి ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేస్తుంది.ప్రపంచంలోనే చాలా పవర్ ఫుల్ మ్యాగజైన్ లలో టైం మ్యాగజైన్ ఒకటి అయితే ఈ మ్యాగజైన్ లో గతంలో కూడా భారతీయులు ఎప్పటికప్పుడు ఎంపిక కాబడుతూనే ఉంటారు అయితే
ఈసారి అమెరికా ఆరోగ్య రక్షణ రంగంలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేసిన 50 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాని సిద్దం చేసింది…ఆ జాబితాలో ముగ్గురు భారతీయ అమెరికన్లు స్థానం దక్కించుకున్నారు.ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ దీనిని రూపొందించింది.ఈ జాబితాలో దివ్యా నాగ్, డాక్టర్ రాజ్ పంజాబీ, అతుల్ గవాండే ఉన్నారు.
దివ్యా నాగ్ : వైద్యులు, పరిశోధకులకు ఉపయోగపడేలా యాపిల్ వాచ్ సీరీస్-4లో యాప్‌ను సిద్ధం చేశారు.రాజ్ పంజాబీ : వైద్య సదుపాయాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఆరోగ్య రక్షణ కార్యకర్తలకు శిక్షణను అందించేలా సాంకేతిక ఏర్పాట్లు చేశారు.గవాండే : పాదర్శకంగా, తక్కువ వ్యయంతో కార్పొరేట్ ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి సల్పారు.
తాజా వార్తలు