హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫిర్యాదు చేశారు.కొందరు వ్యక్తులు తనను చంపుతానని బెదిరిస్తున్నారని కోమటిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో తనను హత్య చేస్తామంటూ కొందరు వీడియోలు పోస్ట్ చేశారని కంప్లైంట్ ఇచ్చారు.ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.