విశ్వాసం అంటే ఇదేనేమో.. బాలిక‌ను తోడేలు నుంచి కాపాడిన కుక్క‌పిల్ల‌!

కుక్కలకు ఉన్న విశ్వాసం గురించి అనేక మంది అనేక సార్లు చెప్పి ఉంటారు.కుక్కలు మనుషుల కన్నా ఎక్కువ విశ్వాసంగా ఉంటాయనేది అందరూ ఒప్పుకుని తీరాల్సిన సత్యం.

 Is This What Faith Is All About The Puppy Who Saved The Girl From The Wolf, Dog,-TeluguStop.com

చాలా సందర్భాల్లో కుక్కలు తమ యజమానులను ప్రమాదాల భారి నుంచి రక్షించాయి.తాజగా కెనడాలో జరిగిన ఓ ప్రమాదంలో తమ బుల్లి యజమానిని ఓ కుక్క కాపాడి తన విశ్వాసాన్ని ప్రదర్శించుకుంది.

దీంతో ఆ యజమాని కుక్క పట్ల పెంచుకున్న ప్రేమకు అంతే లేకుండా పోయింది.

కెనడాలో కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ ఘటన జరిగింది.

ఆ సమయంలో లాక్ డౌన్ మూలంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.ఎంతలా అంటే ఎవరైనా సరే ఆ నిశబ్ధానికి భయపడేలా ఉన్నాయి.

ఆ సమయంలో పదేళ్ల వయసున్న లిల్లీ అనే అమ్మాయి మెస్సీ అనే తన పెంపుడు కుక్కను తీసుకుని సరదాగా వాకింగ్ కు బయళ్దేరింది.ఎవరూ లేని రోడ్డు మీద తాను ఒక్కతే తన పెంపుడు కుక్క మెస్సీతో నడుచుకుంటూ వెళ్తుంది.

అదే సమయంలో అక్కడకు వచ్చిన ఓ తోడేలు లిల్లీ మీద దాడి చేయబోయింది.అది చూసి హడలిపోయిన లిల్లీ ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోక తన పెంపుడు కుక్క మెస్సీని అక్కడే వదిలి పెట్టి ఇంటికి పరుగు అందుకుంది.

దీంతో ఆ తోడేలు కూడా లిల్లీని వెంబడించసాగింది.అప్పుడు పెంపుడు కుక్క మెస్సీ ఆ తోడేలు లిల్లీని ఏం చేయకుండా పోరాడింది.తను శక్తి వంచన లేకుండా పోరాడడంతో ఆ తోడేలు లిల్లీని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.పెంపుడు కుక్క మెస్సీ ధైర్యం, తెగువ వలన లిల్లీ తోడేలు భారి నుంచి రక్షించబడింది.

ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డవగా… ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube