నిజంగా ఈ రైతు అదృష్టవంతుడు.. పంటలు పండిచకుండానే లక్షాధికారి..!

వరసగా ఆరవసారి మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఒక రైతును అదృష్టం వరించింది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లాలో గల పొలాల్లో దాదాపు 12 లక్షల కారెట్ల వజ్రాలు ఉంటాయని అంచనా వేసి, ఈ వజ్రాలను భూమిలో నుంచి బయటకు తీసేందుకు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉండే స్థానిక రైతులు, కార్మికులకు ఈ భూమిని లీజ్‌కు ఇస్తుందని డైమండ్‌ ఆఫీసర్‌ ఇన్‌చార్జ్‌ నూతన్‌ జైన్‌ తెలిపారు.

 This Farmer Is Really Lucky A Millionaire Without Harvesting Crops, Farmer, Foun-TeluguStop.com

ఈ క్రమంలోనే పన్నా జిల్లాకు చెందిన రైతుకు అధిక నాణ్యత కలిగిన వజ్రం దొరికింది.ఇంకో విశేషం ఏంటంటే.

ఇలా ఆయనకు వజ్రం దొరకడం అనేది రెండేళ్లలో ఇది ఆరవసారి.గత సంవత్సరం 7.44 కారెట్ల విలువ కలిగిన డైమండ్‌ దొరికడంతో పాటు, మరో 4 సార్లు రెండు నుండి 2.5 క్యారెట్ల విలువ కలిగిన వజ్రాలను వెలికి తీశారు.ఇప్పుడు దొరికిన వజ్రం 6.47 క్యారెట్ల నాణ్యత కలిగిన వజ్రం.

అసలు వివరాల్లోకి వెళితే.పన్నా జిల్లాలోని జరువాపూర్ ప్రాంతానికి చెందిన ప్రకాష్ మజుందార్ అనే రైతు ప్రభుత్వ భూమిని లీజుకు తీసుకుని వజ్రాల కోసం తవ్వకాలు మొదలుపెట్టాడు.ఈ క్రమంలోనే అతనికి 6.47 కారెట్ల బరువు కలిగిన వజ్రం దొరికింది.ఈ వజ్రం ఖరీదు ఖరీదు సుమారు రూ.30 లక్షల దాకా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రకాష్ మంజుదార్ కి ఆరవసారి కూడా వజ్రం దొరకడం పట్ల హర్షం వ్యక్తం చేసాడు.

ఈ వజ్రాన్ని ప్రభుత్వ లెక్కల ప్రకారం ధర నిర్ణయించి వేలం పెడతామని అధికారులు అంటున్నారు.

ఆ తరువాత ఆ వజ్రాన్ని జిల్లా మైనింగ్‌ అధికారి వద్ద డిపాజిట్‌ చేస్తారని చెప్పారు.వేలం ముగిసిన తరువాత వేలంలో వచ్చిన మొత్తం డబ్బు నుండి ప్రభుత్వ పన్నులు, తదితర ఫార్మాలిటీస్ నుంచి రావలిసింది ప్రభుత్వం మినహాయించుకుని మిగిలిన డబ్బులను రైతులకు ఇస్తామని వెల్లడించారు.

ఇలా డైమండ్‌ వేలంలో ప్రకాష్ మంజుదార్ ఒక్కరే తీసుకోకుండా తనతో పాటు మైనింగ్‌లో తనకు సహాయంగా ఉన్నామరో నలుగురితో కలిసి సమానంగా తీసుకుంటామని ప్రకాష్‌ మజుందార్‌ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube